జగన్ బాహుబలి, నేను దేవసేన, పగ చల్లారింది: శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ బాహుబలి, నేను దేవసేన, పగ చల్లారింది: శ్రీరెడ్డి

May 23, 2019

ఏపీలో వైసీపీ ఫ్యాను గాలి వీస్తోంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. 152 స్థానాలు ఆధిక్యంలో ఉండగా.. 25 ఎంపీ స్థానాలకు అన్నింట్లోనూ వైసీపీ ముందంజలో దూసుకెళ్తోంది. దీంతో వైసీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఒక్కోక్కరు ఒక్కోల స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాలు పంచుకుంటున్నారు.

కాస్టింగ్ కౌచ్‌తో సేమస్ అయిన సినీ నటి శ్రీరెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో పండగ చేసుకుంటుంది. వైసీపీ గెలుపుపై ఫేస్‌బుక్‌లో తన ఆనందాన్ని పంచుకుంటూ.. ప్రత్యర్థులపై పంచ్ విసిరింది. శ్రీరెడ్డి కొద్దిసేపటి క్రితమే ఫేస్‌బుక్‌లో పోస్టు పెడుతూ.. ‘ నా పగని, పంతాన్ని తీర్చిన అందరికి నా సాష్టాంగ నమస్కారం. నేను రియల్ దేవసేన.. రియల్ బహుబలి వన్ అండ్ ఓన్లీ జగన్’ అని పేర్కొంది. ఆమె పోస్టుతో పాటు బహుబలిలో అనుష్క ఫొటో.. పక్కనే తన ఫొటో పెట్టుకుంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు, వైసీపీ అభిమానులు శ్రీరెడ్డికి మద్దతు తెలుపుతుంటే.. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు మాత్రం శ్రీరెడ్డిపై మండి పడుతున్నారు.