సాక్ష్యాలు మహా టీవీ వద్ద.. నన్ను చంపేస్తే అందరి పేర్లూ బయటికి.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

సాక్ష్యాలు మహా టీవీ వద్ద.. నన్ను చంపేస్తే అందరి పేర్లూ బయటికి.. శ్రీరెడ్డి

April 10, 2018

శ్రీరెడ్డి మరిన్ని సంచలన విషయాలను బయటపెడుతోంది. టాలీవుడ్‌లో తనతోపాటు చాలామంది తెలుగు అమ్మాయిలను లైంగికంగా వాడుకుని మోసం చేశారన్న తన ఆరోపణలకు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని తెలిపింది. ‘అవి మహా న్యూస్ టీవీ చానల్ వద్ద ఉన్నాయి. అన్ని వీడియో సాక్ష్యాలనూ మహా టీవీకి అందించాకే ఆ చానల్ నా సమస్యను బయట ప్రపంచానికి తెలిపేందుకు ముందుకొచ్చింది.. ఆ చానల్‌పై విమర్శలు సరికాదు..’ అని ఫేస్ బుక్ వీడియోలో పేర్కొంది.‘నిజాల్ని చెబుతున్నందుకు నన్ను చంపుతారేమోనని భయంగా ఉంది. నాకేదైనా జరిగితే,  అందరి పేర్లూ బుల్లితెరపై ప్రత్యక్షమవుతాయి.. మహా టీవీకి రంకు అంటగడితే నిప్పుతో ఇల్లు కడుక్కున్నట్టే. అగ్నిని శుద్ధి చేయాలని ట్రై చేయకండి..’ అని హెచ్చరించింది.

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపైనా ఆమె స్పందించింది. ‘నేను రెండున్నరేళ్ల పాటు సాక్షి టీవీ ఉప్పు తిన్నాను. ఆ చానల్ నాకు అన్నం పెట్టింది.. ఆ చానల్‌ను, యాజమాన్యాన్ని అపఖ్యాతి పాలు చేసేంతటి దరిద్రురాలిని కాను.. నేను టీడీపీతో కుమ్మక్కు కాలేదు. నాకు రాజకీయ పార్టీలతో లాలూచీ పడాల్సిన అవసరం లేదు. నా పోరాటానికి మీడియా ఓ స్టేజ్ క్రియేట్ చేసింది. అలాంటి మీడియాపై నిందలేస్తే, అందరి జాతకాలనూ బయటపెడతాను.. కొన్ని వందల మంది అమ్మాయిల మానాలు పోతున్నాయి. వారికి అండగా నిలవడమే నా కర్తవ్యం’ అని పేర్కొంది.

Mahaa Tv ki ranku antagadithe,nipputho illu kadukunnatte..agni ni sudhi cheyalani try cheyakandi

Posted by Sri Reddy on Monday, 9 April 2018