శ్రీరెడ్డి గెలిచింది.. నిషేధం ఎత్తివేత.. కమిటీ ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి గెలిచింది.. నిషేధం ఎత్తివేత.. కమిటీ ఏర్పాటు

April 12, 2018

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై అర్ధనగ్న ప్రదర్శనతో సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి విజయం సాధించింది. ఆమె విమర్శలు, సాక్ష్యాల దెబ్బకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) కాళ్లబేరానికి దిగొచ్చింది. ఆమెపై నిషేధాన్ని ఎత్తేసింది. ఆమెతో 900 మంది ‘మా’ నటులు కలసి నటిస్తారని  మా అధ్యక్షుడు శివాజీ గురువారం సాయంత్రం విలేకర్ల సమావేశం పెట్టి మరీ ప్రకటించాడు. ఆమెపై తమకు కోపం లేదని, ఆమె తమ కుటుంబ సభ్యురాలని చెప్పారు.

మరో ఘన విజయం కూడా..

అమ్మాయిలపై లైంగిక వేధింపులపై దర్యాప్తు కోసం మా.. కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హరాస్మెంట్(క్యాష్)ను కూడా ఏర్పాటు చేసింది. బాధితులు ఎవరైనాసరే ఈ కమిటీ ముందుకొచ్చి ఫిర్యాదు చేయొచ్చు.