టాలీవుడ్ స్టూడియోలు బ్రోతల్ హౌసులు.. శ్రీరెడ్డి - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ స్టూడియోలు బ్రోతల్ హౌసులు.. శ్రీరెడ్డి

April 10, 2018

‘తెలుగు సినీపరిశ్రమకు చెందిన స్టూడియోలు బ్రోతల్ హౌసులుగా మారాయి. నేను బాధితురాలిని. ఒక ప్రముఖ నిర్మాత కొడుకు నన్ను లైంగికంగా వాడుకున్నాడు. స్టూడియోలో నాపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఆ స్టూడియో స్థలం ప్రభుత్వం ఇచ్చింది…’ అని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.నిర్మాత కొడుకుకు, తనకు సంబంధించిన ఫొటోలు తన వద్ద ఉన్నాయని, అవే తన బ్రహ్మాస్త్రాలని పేర్కొంది. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందంటూ శ్రీరెడ్డి ‘మా’ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేయడం తెలిసిందే. దీనిపై ఆమె ఇండియాటుడే పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్‌పై సంచనల ఆరోపణలు సంధించింది.

‘ఆ నిర్మాత కొడుకు స్టూడియోకు రావాలని నన్ను బలవంతం చేసేవాడు. అక్కడి తీసుకెళ్లి లైంగిక దోపిడీకి పాల్పడేవాడు. టాలీవుడ్ స్టూడియోల్లో యువతులపై లైంగిక దోపిడీ జరుగుతోంది. పెద్ద దర్శకులు, నిర్మాతలు, హీరోలు స్టూడియోలను బ్రోతల్ హౌసులుగా వాడుకుంటున్నారు. అవి రెడ్ లైట్ ఏరియాలు. అక్కడికి బయటివారెవరూ రారు. పోలీసులు కూడా రారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్నితీవ్రంగా పట్టించుకోవడం లేదు. నిర్మాతలు, దర్శకులు నన్ను వేధించారు. న్యూడ్ వీడియో చాట్ చేయాలని కోరేవారు. నేను పంపాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. అయినా వారు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం లేదు.. మమ్మల్ని కేవలం సెక్స్ కోసం వాడుకుంటున్నారు.  మేం రాత్రి వారితో పడుకుని మరుసటి రోజు షూటింగ్ సైట్‌కు వెళ్తే.. అక్కడ మరో యువతి ఉంటుంది. ఇదేం అన్యాయం అని మేం ప్రశ్నిస్తే.. ‘మీరు ఒప్పుకుంటేనే నీతో పడుకున్నాం.. మీకు మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు’ అని అంటున్నారు. పెద్ద దర్శకులు, హీరోలు.. మమ్మల్ని నిర్మాతల వద్దకు, ఫైనాన్షియర్ల వద్దకు, రాజకీయ నాయకుల వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది.