తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది..! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురవేసింది..!

July 28, 2017

తెలంగాణలో పుట్టిన మరో బిడ్డ తెలంగాణ గొప్పదనాన్ని,ప్రాముఖ్యతను ప్రపంచానికి వెలుగెత్తి చూపింది.తెలంగాణ విద్యార్ధిని శ్రీవిద్య…రష్యాలో ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ ఎల్ బ్రస్ ఎక్కి శభాష్ అనిపించుకుంది,ఆ పర్వతం ఎత్తు 5,642 మీటర్లు(18,506 అడుగులు),మౌంట్ ఎల్ బ్రస్ యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం, అలాంటి శిఖరం పైకి ఎక్కి శ్రీవిద్య జాతీయ జెండాతోపాటు,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ప్రదర్శించింది. శ్రీవిద్య ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో చదువుతుంది.ఈ సాహసం గురించి తెలిసన వారందరూ శభాష్ శ్రీవిద్య అని మెచ్చుకుంటున్నారు,ఇదివరకే  నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన గిరిజన బాలిక మాలావత్ పూర్ణ అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. మనగడ్డమీదున్న మట్టిలో మాణిక్యాలు ఇలా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.కష్టేఫలి అన్న జీవితసత్యాన్ని ప్రపంచానికి మరోపారి తెలుపుతున్నాయి.