పిల్లల ఇష్టమే నా ఇష్టం - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల ఇష్టమే నా ఇష్టం

May 15, 2017


అతిలోక సుందరి శ్రీదేవి ‘మామ్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మదర్స్‌డేనాడు సినిమా ప్రచార కార్యక్రమంలో శ్రీదేవి పాల్గొంది. తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి, ఖుషి గురించి ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

‘‘నా పెద్ద కూతురు జాహ్నవిది చాలా మటుకు నా మనస్తత్వమే. నెమ్మదస్తురాలే కానీ తనేం చేసినా పక్కన నేనుండాలి. కానీ నా రెండో కుమార్తె ఖుషి చిన్నపిల్లే అయినా తన పనులన్నీ స్వయంగా చేసుకోగలదు. కానీ జాహ్నవి అలా కాదు.. ఎదుగుతున్న పిల్లే కానీ ఒక్కోసారి నేనే తినిపించాలి. చిన్నపిల్లలాగా నన్నే పడుకోబెట్టమని అడుగుతుంటుంది. ఖుషి మాత్రం చిన్నప్పటి నుంచి చాలా ఇండిపెండెంట్‌. జాహ్నవి సినిమాల్లోకి రావాలనుకుంటోంది.

పిల్లలు ఇష్టపడుతున్నారు కాబట్టి మేమూ ఒప్పుకుంటున్నాం. నేను సినిమాల్లోకి వస్తానంటే అమ్మ నాకు పూర్తి మద్దతు తెలిపింది. ఇప్పుడు నేనూ అదే చేస్తాను.’’ అని తన కూతుళ్ల గురించి శ్రీదేవి చెప్పింది.

HACK:

  • Sridevi talks about her beloved daughters especially about Jahnavi Kapoor on Mother’s day.