జాన్వీ కపూర్ డ్రెస్ కాపీ..ఫ్యాషన్ షోకి నో ఎంట్రీ! - MicTv.in - Telugu News
mictv telugu

జాన్వీ కపూర్ డ్రెస్ కాపీ..ఫ్యాషన్ షోకి నో ఎంట్రీ!

December 12, 2019

Janhvi Kapoor02

ప్రముఖ నటి అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జాన్వీ కపూర్‌ తన అందంతో అభిమానులను ఆకట్టుకుంటోంటున్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో ఇంద్రజగా నటించిన శ్రీదేవి ప్రత్యేకంగా కనిపించేందుకు రెక్కలతో కూడిన తెలుపు డ్రెస్‌ను ధరించింది. ఆ డ్రెస్‌ని సింగపూర్‌లో ప్రత్యేకంగా తయారు చేయించారు. 

తాజాగా ఓ ఫ్యాషన్‌ షోలో జాన్వీ కపూర్‌ అలాంటి తెల్లటి దుస్తులను ధరించింది. తెల్లటి ఫెదర్స్‌తో తయారు చేసిన ఆ దుస్తుల్లో అందమైన హంసలా జాన్వీ కపూర్‌ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఏదో ఒక రోజు జాన్వీ కపూర్‌ కూడా అతిలోక సుందరిగా కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు. అయితే జాన్వీ ధరించిన డ్రెస్ డిజైన్ కాపీ కొట్టారంటూ వార్తలు వస్తున్నాయి. సెర్బియాకు చెందిన మిహనో మోమోస 2017లోనే ఇలాంటి డ్రెస్‌ని డిజైన్ చేశారని.. అందుకే ఈ డ్రెస్ ధరించిన జాన్వీ కపూర్‌ని ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి నిర్వాహకులు అనుమతించలేదని వార్తలు వస్తున్నాయి.