sridevi daughter janhvi kapoor says vijay deverakonda is ‘practically married’
mictv telugu

విజయ్, రష్మికల రిలేషన్ పై.. శ్రీదేవి కూతురు జాన్వీ షాకింగ్ కామెంట్స్

October 27, 2022

ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ రిలేషన్స్ పై పుకార్లు చాల సహజం. కలిసి రెండు సినిమాల్లో నటించారంటే చాలు డేటింగ్ చేసుకుంటున్నారని కామెంట్స్ పుట్టేస్తాయి. ఇక పొరపాటున బయట పార్టీలో కనిపించారంటే చాలు ఇద్దరికీ సహజీవనాన్ని అంటగట్టేస్తారు. అలాంటిది కొద్దీ రోజులుగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మికలు పెద్ద ఎత్తున బయట తిరుగుతూ చాలాసార్లు మీడియాకి చిక్కారు. రష్మిక అయితే విజయ్ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ కి సైతం హాజరైంది. అన్నింటికీ మించి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ కారణాలతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతూ వస్తుంది. కొందరైతే పెళ్లి కూడా చేసుకోనున్నట్టు చెప్తున్నారు. ఈ విషయంపై విజయ్, రష్మికలు పలుమార్లు ఖండించినా వార్తలు ఆగటం లేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరి రిలేషన్ పై శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పరోక్షంగా స్పదించినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో జాన్వీ మాట్లాడుతూ విజయ్ దేవరకొండకి ఇప్పటికే పెళ్లి అయిపోయింది అని అర్ధం వచ్చేలా స్పందించింది.

తాజాగా ఓ చాటింగ్ సెషన్ లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ విజయ్ చాలా ప్రాక్టికల్ గా పెళ్లాడేశాడు! అని వ్యాఖ్యానించింది. జాన్వీని తన ‘స్వయంవర్’ కోసం మూడు పేర్లను ఎంచుకోమని హోస్ట్ అడిగితే.. హృతిక్- రణబీర్ – టైగర్ అని మూడు పేర్లు చెప్పి షాక్ ఇచ్చింది. ఎందుకంటే విజయ్ దేవరకొండ తన క్రష్ అని, విజయ్ మ్యారేజ్ మెటీరియల్ అని పలుమార్లు పొగిడిన జాన్వీ ఇప్పుడు అతని పేరే ఎత్తలేదు. రౌడీని కాదని పెళ్లయిన రణబీర్ ని , విడాకులిచ్చిన హృతిక్ ని ఎంచుకుంది కానీ విజయ్ పేరు తీయకపోవడానికి.. హీరోయిన్ రష్మికనే కారణం అంటున్నారు. విజయ్- రష్మికలు అధికారికంగా డేటింగ్ లో ఉన్నట్టు జాన్వీ కన్ఫామ్ చేసిందనే అంటున్నారు. విజయ్ రిలేషన్ పై జాన్వీ మరింత క్లారిటీ ఇస్తూ.. ‘అతను ఇప్పటికే ఆచరణాత్మకంగా వివాహం కూడా చేసుకున్నాడు’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే విజయ్ రష్మికలస్నేహం, ప్రేమ వ్యవహారంపై జాన్వీ .. సారా అలీ ఖాన్ లు ఇప్పటికే చాలా స్పష్టమైన హింట్లు ఇచ్చారు.