Sridevi Daughter Jhanvi Kapoor Visits Tirumala
mictv telugu

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

September 2, 2022

 

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం స్వామి వారి నైవేధ్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెను ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించారు. తీర్ధ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన జాన్వీ కపూర్ తో ఫోటోలు దిగ్గేందుకు భక్తులు ఆసక్తి చూపారు. జాన్వీ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.