శ్రీదేవి ప్రమాదంలో చనిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా? - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి ప్రమాదంలో చనిపోయిందా? ఆత్మహత్య చేసుకుందా?

February 26, 2018

అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై దుబాయ్ ఫోరెన్సిక్ వైద్యులు ఇచ్చిన నివేదిక పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. శ్రీదేవి రక్తంలో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడ్డంతో ఆమె మద్యం మత్తులో టబ్‌లో పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు. అయితే హైక్లాస్ జనానికి మద్యం, టబ్‌లో స్నానాలు మూమూలే కనుక శ్రీదేవి విషయంలో ప్రమాదం జరిగిందంటే నమ్మశక్యం కాకుండా ఉందంటున్నారు.

ఒత్తిడితో..

శ్రీదేవి ఇటీవల బాగా సన్నబడ్డారు. తిరుమలకు వచ్చినప్పుడు కళ తప్పినట్లు కనిపించారు. తరచూ సర్జరీలు చేయించుకుంటున్న ఆమె కఠినమైన డైటింగ్ కూడా చేస్తున్నారు. సినిమాల్లో మళ్లీ తన సత్తాను చూపాలని తపనపడుతున్నారు. మరోపక్క.. ఆమె పెద్ద కూతురు జాన్వీకపూర్ సినీ కెరీర్‌కు పాదులు వేస్తున్నారు. జాన్వీ సినీ కెరీర్‌పై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. రాధ, లక్ష్మి వంటి పలువురు హీరోయిన్ల కూతుర్లు సినిమాల్లో రాణించలేకపోవడం తెలిసిందే. ఇలాంటివి గమనించి శ్రీదేవి జాన్వీ విషయంలో డబుల్ ఎఫర్ట్ పెడుతున్నారు.

మేనల్లుడి పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి సంబరంగానే కనిపించింది. పెళ్లికి భర్త బోనీ కపూర్ కూడా హాజరయ్యారు. అయితే తర్వాత ఆయన ఏదో పనిపై మళ్లీ భారత్‌కు వచ్చారు. కానీ శ్రీదేవి మాత్రం షాపింగ్ కోసం దుబాయ్‌లోనే ఉండిపోయారు. తర్వాత బోనీ మళ్లీ దుబాయ్ వెళ్లారు. శనివారం రాత్రి శ్రీదేవి కాస్త మద్యం పుచ్చుకున్న తర్వాత స్నానం కోసం బాత్రూంకు వెళ్లారు.

లోపల గడియ పెట్టుకున్న ఆమె ఎంతసేపటికీ రాకపోవడంతో బోనీ తలుపు తట్టారు. స్పందన లేకపోవడంతో హోటల్ సిబ్బందితో కలసి బలప్రయోగంతో తలుపు తెరవగా, శ్రీదేవి విగతజీవిగా కనిపించింది. సర్జరీలు, డైటింగ్, మానసిక ఒత్తిడి వంటి ఆర్థికేతర కారణాలతో శ్రీదేవి తనకు తెలియకుండా ‘ప్రమాదవశాత్తూ’ ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే అనుమానం తలెత్తుతోంది. కేసుపై దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ జరిపే దర్యాప్తులో అసలు విషయం తెలిసేవరకు అందాలతార మరణంపై అనుమానాలు చక్కర్లు కొడుతూనే ఉండడం ఖాయం..!!