శ్రీదేవి మద్యం తాగదు.. ఆమెను హత్య చేశారు! - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీదేవి మద్యం తాగదు.. ఆమెను హత్య చేశారు!

February 27, 2018

శ్రీదేవి మరణంపై మిస్టరీల నీడలు కమ్ముకుంటున్నారు. ఆమె శరీరంలో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు చెప్పడం తెలిసిందే. అయితే ఆమె అసలు మద్యం తీసుకోదని, ఆమెను హత్య చేశారని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి సంచలన ఆరోపణలు చేశారు.‘ఆమె మొదట గుండెపోటుతో చనిపోయిందన్నారు. తర్వాత ప్రమాద వశాత్తూ మద్యం పుచ్చుకుని, టబ్బులో పడిపోయి చనిపోయిందంటున్నారు.. నాకు తెలిసినంతవరకు ఆమెకు మద్యం అలవాటు లేదు. ఎవరైనా ఆమెకు బలవంతంగా మద్యం తాగించారా? ఆమెను హత్య చేశారా? దీనికి సమాధానాలు రావాలి?’ అని ఆయన అన్నారు.

సీసీ ఫుటేజీ ఏమైంది?

ఈ మొత్తం  వ్యవహారంలో సీసీ టీవీ ఫుటేజి ఏమైందని స్వామి ప్రశ్నించారు. శ్రీదేవి దుబాయ్‌లో చనిపోవడం పలు అను మానాలకు తావిస్తోందన్నారు.  మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు పలువురు సినిమా తారలతో సంబధాలు ఉన్నాయని,  ఈ కోణంలో దర్యాప్తు సాగించాలని డిమాండ్ చేశారు.