వేలానికి శ్రీదేవి పెయింటింగులు.. - MicTv.in - Telugu News
mictv telugu

వేలానికి శ్రీదేవి పెయింటింగులు..

March 1, 2018

అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి చేయి తిరిగిన చిత్రకారిణి కూడా. తీరిక దొరికిప్పుడు ఆమె రంగులకు పనిచెప్పేది. తను వేసిన పెయింటింగులను బంధుమిత్రులకు కానుకగా ఇచ్చేది. శ్రీదేవి వేసిన సోనమ్ కపూర్, మైకేల్ జాక్సన్ పెయింటింగులను త్వరలో దుబాయ్‌లో వేలం వేయనున్నారు.సోనమ్ శ్రీదేవి మరిది అనిల్ కపూర్ కూతురు. ఆమె నటించిన ‘సావరియా’ చిత్రంలోని ఆమె ఫొటో ఒకటి శ్రీదేవి బాగా నడంతో బాగా నచ్చడంతో దాన్ని పెయింటింగ్ చేశారు. శ్రీదేవి పెయింటింగ్‌లు విలువైనవి భావించిన ఓ వేలం సంస్థ వాటిని దుబాయ్‌లో వేలం వేద్దామని 2010లో ఆమెకు చెప్పింది. జాక్సన్ పెయింటింగ్‌కు రూ. 8 లక్షల ధర నిర్ణయించారు. అయితే శ్రీదేవి వేలానికి నో చెప్పింది. వేలం ద్వారా వచ్చే సొమ్ములను ధార్మిక సంస్థలకు ఇస్తామని వారు చెప్పడంతో సరేనంది.