ఆ ఇద్దరి నడ్మ బగ్గు మంటున్నది.... - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఇద్దరి నడ్మ బగ్గు మంటున్నది….

June 28, 2017

ఆమె ఇప్పటికీ అతిలోక సిందరే…ఈయన లోకాలు ఏల్తున్న డైరెక్టర్. ఈ ఇద్దరి

నడ్మ పచ్చిగడ్డి కాదు… గడ్డి ఉన్నా లేకున్నా మంటలు వాటంతటవే లేసి

పడ్తున్నట్లుంది. ఆ నడ్మ బాహుబలి డైరెక్టర్ ప్రభాస్ శ్రీదేవి స్టార్

హోటళ్ల సూట్లు అడిగింది… కోట్ల రూపాయలు అడిగిందని ఓ ఇంటర్వ్యూల చెప్పిండట.

దాన్ని మీడియా తిప్పితిప్ప సూపింది…. సోషల్ మీడియాల కండ్లు బైర్లు

కమ్మెటట్లు తిప్పింది. అటు తిర్గి ఇటు తిర్గి అది సక్కన శ్రీదేవి చెవులకు తాకింది.

నాలుగు దినాలు లేట్ అయినా సరే కని. మేడమ్ బాగా రెస్పాండ్ అయింది.

కోట్లు… సూట్లు అడిగితే…300 దాంక సిన్మాలు తీస్తాన చెప్పిండని ఎదురు ప్రశ్న

వేస్తున్నది. ఆ డైరెక్టర్ అబద్దాలు చెప్పిండొచ్చని కూడా అన్నదట.ఇంకా నయం

శ్రీదేవిని పెట్టుకుంటే… శివగామి చిత్తై పోయేదని కూడా అప్పట్ల మీడియా,

సోషల్ మీడియా కోడై కూసి…. పులై గ్రాండ్రించింది. చివరాకరకు రమ్యకృష్ణతోనే

రమ్యమైన సీన్లు దీసి రాజమౌళి శెభాష్ అన్పించుకున్నడు.

ఇగ మరి శ్రీదేవికి కోపం వచ్చి స్పందించిందో….. ఇట్లనే గాలికి వొదిలేస్తే మరింత

ఇబ్బందని అని అనుకున్నదో తెలియదు కానీ మేడమ్ అయితే… ఘాటు రికాయాక్ట్

అయ్యారు. అప్పట్ల సిన్మాల్ల నటించే టప్పుడు… స్టార్ హోటల్లు లేవు కద…

బట్టలు మార్సుకోనికే చెట్ల చాటుకు పోయే వాల్లమని గుర్తు చేసుకున్నది మీడియా

వాళ్లతోని.. అంతే కాదు తన భర్తనే నిర్మాత అయినప్పుడు… నిర్మాతల కష్టాలు తనకు

తెల్వవా ఏందీ.. అని గూడ బాధపడ్డదట. పొగరు ఆహాంకారం తన ఇంటావంటా వేలని

సూటిగనే చెప్పిందట ఈ అతిలోక సుందరి.

స్టార్ హోటళ్ల సూట్లు…కోట్ల రూపాయలు, ఫ్లైట్ టికెట్లు అంతా ఉత్త

ముచ్చట్నే అని కొట్టి పారేసుడు గాదు… ఇట్లా ప్రచారం చేసుడు మంచిది కాదని

కూడా అన్నదట. ఇద్దరు తెలుగుల పెద్ద స్టార్లే… తెర మీద ఈమె వెలిగితే… ఎతర

వెనుక, తెర మీద వెల్గుతున్న డైరెక్టర్ ఈయన. మరిద్దరి పంచాయితీకి ఫుల్ స్టాప్

ఎప్పుడు పడుతుందో చూడాలి. ఇప్పటికైతే అతిలోక సుందరి నుండి స్పందన ఉంది. ప్రతి

స్పందన రాజమౌళి ఎట్లిస్తడో మరి.