మరిదితో శ్రీదేవి ప్రాజెక్టు వర్కౌట్ అయ్యేనా ! ? - MicTv.in - Telugu News
mictv telugu

మరిదితో శ్రీదేవి ప్రాజెక్టు వర్కౌట్ అయ్యేనా ! ?

June 19, 2017

‘ మిస్టర్ ఇండియా 2 ’ సినిమాలో శ్రీదేవియె నటించనున్నట్లు ఖబర్. అదీ మరిది అనిల్ కపూర్ తోనేననేది హాట్ టాపిక్. అప్పట్ల అంటే 1987 వ సంవత్సరంల అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా వచ్చిన మిస్టర్ ఇండియా సినిమా బాక్సాఫీస్ దెగ్గర జోర్ దార్ కలెక్షన్లు వసూల్ చేసి పెద్ద హిట్టైంది. అయితే ఈ సినిమాను చానా రోజుల సంది రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నరు. అది ఇన్ని రోజులకు బలం పట్టుకచ్చినట్టైంది. ఇందులో కూడా వదినా, మరుదులే జంటగా నటిస్తరనే పుకార్ గూడా మస్తు చక్కర్లు కొడ్తున్నది. కనీ ఈ రొండో సినిమాకు డైరెక్టర్ గా శేఖర్ కపూర్ డైరెక్షన్ చెయ్యననే సరికి వేరే డైరెక్టర్ అన్వేషణలో పడ్డారంట చిత్ర యూనిట్ సభ్యులు. భర్త బోనీకపూర్ నిర్మించిన ‘ మామ్ ’ సినిమా రిలీజ్ కు దగ్గరగావుంది. శ్రీదేవియే ఇలా వరసపెట్టి నటించుకుంటూ పోతే మరి తన కూతుళ్ళను ఎప్పడు హీరోయిన్లను చేస్తుందో చూడాలె !