రచయితలు దర్శకులు అవుతున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు శ్రీధర్ సీపాన రెడీ అవుతున్నారు. ‘ బృందావనమది అందరిది ’ అనే సినిమాతో డైరెక్టర్ గా హాట్ సీట్ లో కూర్చొని యాక్షన్, కట్ లు చెప్పనున్నాడు. ఇది వరకు డైలాగ్ రైటర్ గా తనదైన శైలితో తనదైన సపరేట్ మార్క్ వేస్కున్నాడు. పోటుగాడు, పవర్, డిక్టేటర్, పూలరంగడు, లౌక్యం, ఆహా నా పెళ్ళంట, భీమవరం బుల్లోడు, సర్దార్ గబ్బర్ సింగ్.., వంటి సినిమాల్లో రైటర్ గా తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమా చెయ్యాలనే కసరత్తుల్లో మునిగి తేలుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ లా తను కూడా మంచి డైరెక్టర్ గా రాణిస్తాడని విశ్లేషకులు విశ్వసిస్తున్నారు.