ధర్మం పాటిస్తుంది కాబట్టి దానికాపేరు వచ్చిందా.. ఎవడు అడిగాడ్రా నిన్ను - MicTv.in - Telugu News
mictv telugu

ధర్మం పాటిస్తుంది కాబట్టి దానికాపేరు వచ్చిందా.. ఎవడు అడిగాడ్రా నిన్ను

November 11, 2022

తెలుగు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లు మరీ చిన్నపిల్లల కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు. సభ్యసమాజం అసహ్యించుకునే వారి ప్రవర్తన పక్కన పెడితే ఒకరేమో 79 తర్వాత 90, 91 అంటారు. మరొకరేమో థర్మాకోల్ గురించి అవాక్కయ్యే విషయం చెప్తాడు. దీంతో ఎవడు అడిగాడ్రా నిన్ను అని పోకిరి సినిమాలో అలీ డైలాగుతో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ డైలాగ్ చెప్పింది స్వయం ప్రకటిత అపరమేధావి హగ్గింగ్, అద్దం స్టార్ శ్రీహాన్. థర్మాకోల్‌‌కి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఈయన గారు షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు.’

 

 

View this post on Instagram

 

A post shared by Lyf A Zindagi (@lyf_a_zindagi)

అదేంటంటే.. ధర్మం పాటిస్తుంది కాబట్టి థర్మాకోల్ అనే పేరు వచ్చిందంట. ఏంటా ధర్మం అని అడిగితే గాలి ఎటు వీస్తే అటు పోతుందంట అందుకే దానికా పేరు వచ్చిందని సమాధానం చెప్తున్నాడు. దీంతో నెటిజన్లు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. ఇదికాక శ్రీహాన్, శ్రీ సత్యల యవ్వారం వెగటు పుట్టిస్తోంది. హగ్ కోసం ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూడడం, ఒకరి ఒళ్లో మరొకరు దూరిపోవడం చూస్తుంటే ప్రేక్షకుల్లోని ఒక వర్గంలో హాట్ టాపిక్‌‌గా మారింది. ఇక అర్జున్ కల్యాణ్ హౌస్‌‌లో ఉన్నప్పుడు నాకు మగాళ్లు టచ్ చేస్తే ఇష్టం ఉండదు. ముట్టుకుంటే మండిపోద్ది. చేతులు వేస్తే నాకు అస్సలు నచ్చదు అంటూ బిల్డప్ ఇచ్చిన శ్రీసత్య.. ఇప్పుడు శ్రీహాన్ టచ్చింగులోకి వెళ్లడంతో నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు.