Srihari who distributed liquor for KCR to become Prime Minister
mictv telugu

కేసీఆర్ ప్రధాని కావాలని కోడి, కోటరు పంచిన గులాబీ నేత.. వీడియో వైరల్

October 4, 2022

పార్టీ అధినేతల దృష్టిలో పడడానికి నాయకులు నానా తంటాలు పడుతుంటారు. అందరి కంటే భిన్నంగా ప్రయత్నించి తమ గురించి చర్చించుకునేలా చేసుకుంటారు. ఈ క్రమంలో ఇన్నాళ్లూ ఆలయాల్లో పూజలు, రోగులకు పండ్లు పంపిణీ, రక్తదానం వంటి కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కానీ, వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి ఆ గీతను చెరిపేశారు. వివరాల్లోకెళితే.. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న శ్రీహరి.. వినూత్నంగా ఆలోచించి హమాలీలకు కోడి, కోటరు పంపిణీ చేశారు. ఈ విజయదశమి కేసీఆర్ కుటుంబానికి విజయం సాధించి పెట్టాలని ఆకాంక్షించారు. వరంగల్ చౌరస్తాలో చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. బహిరంగంగా మద్యం పంపిణీపై విమర్శలు వస్తున్నా.. కోడి, మద్యం తీసుకున్న హమాలీలు మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు.