శ్రీకాళహస్తి ఆలయంలో గన్ మిస్ ఫైర్.. ఒకరికి గాయాలు  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీకాళహస్తి ఆలయంలో గన్ మిస్ ఫైర్.. ఒకరికి గాయాలు 

October 1, 2020

Srikalahasti Temple Constable Gun

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం చోటు చేసుకుంది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వద్ద ఉన్న తుపాకీ అనుకోకుండా పేలింది. ఈ సంఘటనలో బుల్లెట్ పై కప్పునకు తగలడంతో దాని కారణంగా పెచ్చులు ఊడిపడి కానిస్టేబుల్ గాయపడ్డాడు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎక్కడ ఏం జరిగిందోనని ఆలయ సిబ్బంది ఆందోళన చెందారు. 

కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం ఎప్పటిలాగే ఆలయంలో డ్యూటీకి వచ్చాడు. అక్కడే భద్రతా ఏర్పాట్లలో భాగంగా చేతిలో ఉన్న తుపాకీ అనుకోకుండా పేలింది. కంచు గడప దగ్గర ఆలయం తలుపులు మూసి  తుపాకీని డిపాజిట్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పై కప్పు పెచ్చు చెవికి తాకడంతో చిన్నపాటి గాయం అయిందని అధికారులు వెల్లడించారు. దీనిపై శ్రీకాళహస్తి డిఎస్పీ విచారణ జరుపుతున్నారు. ఎవరికీ ఎలాంటి అపాయం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.