దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న శ్రీలంకలో నిరసనలు, ఆందోళనలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని గడ్డు పరిస్థితులకు సమాధానంగా ప్రధాని రాజపక్స సోమవారం రాజీనామా చేశారు. అధ్యక్షుడు గొటాబయ రాజపక్స త్వరలో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా, రాజధాని కొలంబోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఎంపీని విపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు సోమవారం దారుణంగా కొట్టి చంపేశారు.
ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ముందుగా నిరసనకారులను చెదరగొట్టాలని పోలీసులు భాష్ప వాయు గోళాలు, వాటర్ క్యాన్లతో ప్రయత్నించారు. ఈ గందరగోళంలో అటుగా వచ్చిన అధికార పార్టీ ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిరసనకారులు ఎంపీ కారును అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ వారి నుంచి తప్పించుకొని సమీపంలో ఉన్న భవనంలో దాక్కోగా, కాసేపయిన తర్వాత చూస్తే శవంగా కనిపించారు. ఈ విషయాన్ని ఆదేశ మీడియా వెల్లడించింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకూడదని పోలీసులు నగరవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.
#BREAKING | Sri Lanka ruling party MP Amarakeerthi Athukorala killed in violent clashes, allegedly after exchange of fire in Nittambuwa; Tune in #LIVE here – https://t.co/uJRFmgPTEb pic.twitter.com/1dOPGps5Zx
— Republic (@republic) May 9, 2022