ప్రజాగ్రహానికి తల వంచిన ప్రధాని.. రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాగ్రహానికి తల వంచిన ప్రధాని.. రాజీనామా

May 9, 2022

సంక్షోభంతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రజల డిమాండ్ మేరకు ఆ దేశ ప్రధాని మహింద్ర రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్ధిక, ఆహార సంక్షోభంతో ప్రజలు పాలకులపై తిరగబడగా, వారిని కంట్రోల్ చేయడం కోసం రాజధాని కొలంబోలో కర్ఫ్యూ విధించారు. అయినా ప్రజలు ఆందోళన చేయడంతో కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి. సోదరులైన అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. చివరికి సైన్యం రంగంలోకి దిగినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రధాన మంత్రి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.