హృతిక్ ను ఉచ్చులోకి లాగిన మహేష్ బాబు ? - MicTv.in - Telugu News
mictv telugu

హృతిక్ ను ఉచ్చులోకి లాగిన మహేష్ బాబు ?

July 5, 2017

మన మోతెవరి డైరెక్టర్ కొరటాల శివ తన అయ్య జాగీరన్నట్టు రైటర్ శరత్ చంద్ర కథతోని సినిమా తీశి హిట్టు గొట్టి, హిందీల హృతిక్ రోషన్ కు కాపీ రైట్లు గంపగుత్తకు అమ్ముకున్నడట. సూశిర్రా తెల్వి ? ఎవని పిండం ఎవని గండమన్నట్టే ఉన్నది కత ? ఈ హైద్రవాద్ల జాగలు కబ్జలు జేశి ఒకోన్ది ఇంకోని పేరుమీద పట్ట జేపిచ్చుకుంటరు.. వాడు ఏట్లె ఎల్లుగాన్కెవన్కో అమ్ముకుంటడు. అసలోడేమో ఈగెలు సొర్రంగ నోరు తెర్సుకుంటడు !? అచ్చం అట్లనే ఉన్నది కత ? ‘ పరుల సొమ్ము పామసుంటిది ’ అన్నరు మన పెద్ద మన్సులు. కనీ మన దేశంల శాన మందికి పరుల సొమ్ము పాపెర శాప లెక్కటనే కన్పిస్తది. ఎంటనే పట్టి అమ్రిచ్చి, కమ్రిచ్చి పుల్సు కాస్కొని తిందామని కుతకుతలాడుతుంటరు. అచ్చం గట్లనే ఉన్నది ‘ శ్రీమంతుడు ’ సినిమా దర్శకుడు కొరటాల శివ ఎల్గవెట్టిన హౌలా పని. గాయిన జేశిన పాత్కం పనికి ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మెడకు ఉచ్చు అయి సుట్టుకుంటున్నది ??

అసలు కతేమదంటే.. ‘ శరత్ చంద్ర ’ అనే రైటర్ స్వాతి బుక్కుల రాశిన నవల ‘ చచ్చేంత ప్రేమ ’ ను ముద్దుగ కాఫీ తాగినంత విజ్జుగ కాపీగొట్టి శ్రీమంతుడు సినిమానే తీశి పారేశిండు గదా కొరటాల.. శీన్మ తీశినంత మాత్రాన ఈ కథకు హక్కుదారు, జుమ్మేదారు అయిన రైటర్ శరత్ చంద్ర ఎట్ల ఊకుంటడు ? పోయి కోట్ల కేసు వెట్టిన సంగతి మనకు ఎర్కున్న ముచ్చటనే గదా.. కొరటాల పాపం హీరో మహేష్ బాబు, ఎర్నేని రవిల మీదిగ్గూడ వచ్చింది. కేసు కోట్ల నడుస్తున్నది.

హృతిక్ రోషన్ కండ్లకు పాపం మన కొరటాల పెద్ద పతివర్త లెక్కట కానచ్చినట్టున్నడు. కొన్న పాపాన్కి ఆయినగ్గూడ కోర్టు సమన్లు జారీ జేశెటాకల్ల కరెంట్ షాక్ గొట్టినట్టైండట !?

కుద్దుగ హృతిక్ రోషనే ఈల్లను పిల్శి ‘‘ ఎందుకు సామీ లొల్లులు.. ఆ రైటర్ ను పిల్శి ఆయిన వాటేందో ఇచ్చెయుర్రి.. నేను గూడ ఇంత సరబర జేస్త… అయినా మీకెంత శిగ్గు లేకపోతే గింత బట్టెవాజి పని జేస్తరు మీరు. మీకు కత నచ్చుంటే బాజాప్త ఆయినకింతిచ్చి కొన్కొని శీన్మ తీసుంటే ఈ ఎల్లడం మల్లడం లొల్లే ఉండకపోవు.. తప్పు పని జేశర్రు మీరు.. ఇప్పటికైనా ఆల్శం జెయ్యకుంట రైటర్ కు న్యాయం జేద్దాం.. నేనైతే హిందీల ఈ శీన్మ తీస్తే గా రైటర్ పేరే ఏస్తనని ’’ గడ్డి వెట్టుంటే నయముండు. కొరటాల ఇంకా ఇట్ల ఎన్ని బాసల్ల ఈ కతను కుదువ వెట్టిండో మరి. పాపం వాళ్ళకేం తెల్సు ఇది దొంగ కతనా ? దొర కతనా అనేది ? సూడాలెమరి శరత్ చంద్ర న్యాయం గెలుస్తుందా ? కొరటాల శివ అన్యాయం గెలుస్తుందా ?