కోర్టు మెట్ల దగ్గర శ్రీమంతుడు ! - MicTv.in - Telugu News
mictv telugu

 కోర్టు మెట్ల దగ్గర శ్రీమంతుడు !

June 13, 2017

సినిమా సొసైటీకి టన్నుల కొద్దీ నీతులు, మెసేజ్ లను పాస్ చేస్తుంది కాకపోతే కమర్షియల్ వేలో.. స్క్రీన్ నిండా రిలేషన్స్, లవ్ ప్యూరిటీ, సొసైటీ లొసుగులు, రాజకీయం గడ్ బడ్ లు, ఫ్యామిలీ తతంగాలను, ఫ్రెండ్ షిప్ వాల్యూస్ ని, ఫ్రాడ్ ని ఫ్రాంక్ గా చెప్పే ఏకైక కిస్కా కోన్ ఫీల్డు సినిమా. అటువంటి సినిమా తెర వెనుక చిందిచోర్ పనులు చేస్తే ఎలా వుంటుంది ? క్రియేటర్స్ అని గల్లా ఎగరేసుకొని చెప్పే సినీ దర్శక, రచయితలు వేరేవాళ్ళ క్రియేటివిటీని దొంగిలిస్తే ఎలా వుంటుంది ? ఏడ్చినట్టు వుంటుంది.. ఆ పాపాన్ని మూట గట్టుకున్న సినిమా ‘ శ్రీమంతుడు ’.  రైటర్ నుండి డైరెక్టర్ అయిన కొరటాల శివ గారు చాలా తెలివిగా శ్రీమంతుడు కథను బిందాస్ గా తస్కరించి ‘ తెలివిమంతుడు ’ అనిపించుకున్నాడు ! ఇప్పుడు ఈ డైరెక్టర్ ని ‘ దొంగ ’ అని బ్రహ్మాండంగా అనొచ్చు కదా ?  ఒక రచయిత యొక్క క్రియేటివిటీని చోరీ చెయ్యటం ఎంత వరకు కరెక్ట్ ?

 బుక్ రైటర్స్ హడల్

అప్పట్లో ఎక్కువగా రచయితలు మ్యాగజైన్ల నుండే షైన్ అయినవాళ్ళు. యద్దనపూడి సులోచనరాణి, యండమూరి వీరేంద్రనాథ్, బలభద్రపాత్రుని రమణి వంటి వాళ్ళెందరో తము వివిధ వార, మాస పత్రికలలో రాసిన కథలు, నవలల ద్వారా బాగా ఫేమ్ అయ్యారు. అలా ఫేమస్ అయిన వాళ్ళ నవలలను కాపీ రైట్స్ కింద కొనేసి కుదిరితే ఆ రైటర్ చేతే డైలాగులు కూడా రాయించుకునేవారు ఇంకా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేవాళ్ళు. అది చాలా హెల్దీ కల్చర్. ఈ మధ్యనే మన ప్రేమ్ రాజ్ అనే డైరెక్టర్ యండమూరి ‘ అనైతికం ’ అనే నవల రైట్స్ కొనుక్కొని ‘ ఆకాశంలో సగం ’ అనే సినిమా తీసాడు. హిందీలో కూడా చేతన్ భగత్ రాసిన రెండు పుస్తకాలలో ఒకటి ‘ త్రీ ఇడియట్స్ ’ గా వచ్చింది, రెండోది ఈ మధ్యే ‘ హాల్ఫ్ గర్ల్ ఫ్రెండు ’ గా వచ్చింది. హాలీవుడ్ లో కూడా జె కె. రౌలింగ్ రాసిన ‘ హ్యారీ పొటర్ ’ నవల వరుస సిరీస్ లతో సినిమాలు చేస్తూ, ఆమెకిచ్చే క్రెడిట్ ని ఆమెకిచ్చి రికార్డుల మోత మోగిస్తున్నారు.

ఇది సంస్కారవంతులు హెల్దీగా చేసే పని. సంస్కారం లేకుండా ఒక రచయిత కథని ‘ ఫుగట్ కా మాల్ ఫుప్పాకా ఫాతెహా ’ అన్నట్టు సినిమా తీసి దొబ్బి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని తమ పేర్లు పోస్టర్ మీద వేస్కోవడానికి మనసెలా ఒప్పుతుంది వాళ్ళకు ?‘ మీరేదైనా మ్యాగజైన్లో మంచి కథను గనుక చదివితే వెంటనే కాస్త అటూ ఇటూ మార్చి సినిమా తీసేస్కుందాం, రోజులు చాలా మారిపోయాయి, ఇప్పుడెవరూ పుస్తకాల్లో సోది చదవట్లేదు కాబట్టి మనమే దొంగల్లా చదివి దొరల్లా చురాలీంగే.. కోన్ క్యా ఉఖాడ్ లేగా ? ’ అనే లంగా ధీమాతో చెత్తగా కొత్త ఆచారాన్ని శ్రీమంతుడు సినిమాతో తీస్కొచ్చిన ఘనత రచయిత నుండి దర్శకుడిగా ప్రమోట్ అయిన కొరటాల శివకు దక్కుతుంది.

ఈ ఒక్క దెబ్బతో రైటర్లు పుస్తకాల్లో కథలు రాస్కోవడానికి ఇన్ సెక్యూర్ గా ఫీలయ్యే పరిస్థితి ?? తనుకూడా పాస్టెన్స్ లో రైటరే కదా ? అలాంటి రైటర్ డైరెక్టర్ అవగానే ఇంకొకరి కథను దొంగిలించడం సహీ హై క్యా ?రచయిత రెమ్యూనరేషన్ ఎంతుంటుంది ? మహా అయితే ఆ మహేష్ బాబు తీస్కునే రెమ్యూనరేషన్లో వన్ పర్సెంటు కూడా వుండదు. అంత చిన్న అమౌంటిచ్చి, టైటిల్స్ లో క్రెడిట్స్ ఇస్తే ఏం పోతుంది వీళ్ళకు ? సినిమా హీరోలు, డైరెక్టర్లే స్టార్ లయి కోట్లు సంపాదించాలి గానీ రైటర్ తన కథ మీద కనీస గౌరవ వేతనాన్ని కూడా పొందకూడదా ? ఇదెక్కడి న్యాయం ?? ఇంకొక దారుణమైన నిజమేంటంటే తిరుమలశ్రీ అనే రచయిత రాసిన అపరాధ పరిశోధన నవలను మక్కీ టు మక్కీ కాపీ కొట్టి ఓంకార్ ‘ రాజు గారి గది ’ సినిమా తీసాడని ఆరోపణ వినిపిస్తున్నది. చూడాలి మరి అదెక్కడికొస్తుందో ?

చచ్చేంత ప్రేమ 

శ్రీమంతుడు సినిమాకి మూల కథ చచ్చేంత ప్రేమే. ఈ చచ్చేంత ప్రేమ ఏంటని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది స్వాతి మాస పత్రికలో 2012 లో అచ్చయిన నవల. రాసిన రచయిత శరత్ చంద్ర. అప్పుడు దానికి స్వాతి పాఠకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఎందుకంటే అందులో హీరో ఒక గ్రామాన్ని దత్తత తీస్కొని డెవ్ లప్ చేసే కథ. ఏ పుస్తకంలో ఏముంటుందా అని నక్కలా నక్కి నక్కి చూసే కొరటాల శివ మెల్లగా ఈ కథను ఎత్తేసి సినిమా తీసేసాడు.

కొరటాలా.. శివ శివా…

అయ్యా కొరటాలా.. రామ భగవంతా.. నువ్వు కూడా గతంలో రైటర్ వే కదా సారూ ? పోసాని దెగ్గర ప్రియ శిశ్యుడిగా వున్నావు కదా ? భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, సింహా, ఊసరవెల్లి., వంటి సినిమాలకు రైటర్ గా చేసిన నీకు సాటి రైటర్ ఆవేదన అర్థం అవలేదా ? లేకపోతే నేను సిల్వర్ స్క్రీన్ రైటర్ ని, శరత్ చంద్ర బుక్ రైటర్ దొంగిలించినా అతనేం చేస్తాడనే ఓవర్ కాన్ఫిడెన్సా శివ శివా..ఇదెక్కడి దొంగ బుద్ది నాయనా ? ఆ మధ్య ‘ సింహా సినిమా కథ నాదేనని కానీ డైరెక్టర్ బోయపాటి సీను తన పేరు వేస్కున్నాడు అందుకే నేను కసిగా రైటర్ నుండి డైరెక్టర్ నవాలని పంతం పెట్టుకొని అయ్యానని ’ ప్రగల్భాలు పలికిన నువ్వు ఇలా ఇంకొక రైటర్ని మోసం చెయ్యటం ఏమైనా బాగుందా ? బోయపాటిని ఏం చెయ్యలేం శరత్ చంద్రనైతే చాలా ఈజీగా మోసం చెయ్యొచ్చనే వెర్రి ధీమానా ? ఇలా చేస్తే సినిమా ఇండస్ట్రీ మీద, డైరెక్టర్ల మీద భరోసా పోతుంది మరి ? భుట్టాచోర్ గాల్లు, లఫంగి నా కొడుకులు, దరిద్రులు, దుష్ఠులు రాజ్యమేలే ఏకైక ఇండస్ట్రీ మన టాలీవుడ్ అని కొ. శి వల్ల సుపూత్ అయ్యేలానే వుంది ! ?

కోర్టులో లఢాయి

మూల రచయిత అయినటువంటి శరత్ చంద్ర తన కథను ఎలా దొంగిలిస్తారని కోర్టుని ఆశ్రయించారు. ఎలాగైనా తనకి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. ఆయనకి మద్దతుగా చాలా మంది రచయితలు నిలబడ్డారు. కొరటాల చేసిన బుద్ధి తక్కువ పనికి అటు నిర్మాతకు, హీర్ మహేష్ బాబుకు సైతం చిక్కొచ్చి పడింది. ఏంచక్కా నేను దొంగను కాను ఇది నేను కష్టపడి రాస్కున్న స్క్రిప్టు అని ఝూట్ ఆవాజ్ వినిపిస్తున్న అతని నుండి నాకైన నష్టాన్ని ఎలాగైనా రాబడతానంటున్నారు శరత్ చంద్ర.

మా పెద్దలేరి ?

సినిమా ఫీల్డులో ఎవరికైనా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికి అన్యాయం జరిగితే పొలోమని పరుగెత్తుకెళ్ళే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెద్దలారా.. ఇది కూడా అన్యాయమేగా ? స్పందించలేరా ? ఓహో.. ఇది సినిమా ఫీల్డుకి సంబంధించిన వారి విషయం కాదని చల్ల బట్టేస్కున్నట్టున్నారు ! అంటే ఒక సినిమా వాడికి అన్యాయం జరిగితే స్పందిస్తాం గానీ సినిమా వాడు బయటివారికి అన్యాయం చేస్తే మేమస్సలు పట్టించుకోమనుకుంటున్నట్టున్నారు !?

మహేషూ బాబూ..

సినిమాల్లో రౌడీలు, గూండాలు బట్టెవాజితనం చేస్తే పేద్ద పోటుగాడులా వాళ్ళ తోలు ఒలిచి డప్పు కట్టే హీరో మహేష్ బాబూ.. ఒక దొంగ కథలో హీరోగా నటించి కోట్లు సంపాదించుకున్నావ్.. ఇప్పుడు నువ్వే హీరోలా స్పందించి సదరు మూల రచయిత శరత్ చంద్రకి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మహేషే రంగ ప్రవేశం చేస్తే గానీ ఈ విషయం ఏదో ఒకటి తేలేలా లేదని అంటున్నారు. కానీ మహేషే ఈ సిన్మాకు హీరో, నిర్మాత.

మహేష్ బాబు కోర్టుకు హాజరు కావాల్సిందే క్రిమినల్ కోర్ట్

శ్రీమంతుడు వివాదంలో నాంపల్లి క్రిమినల్ కోర్టు హీరో అండ్ MB క్రియేషన్స్ అధినేత మహేష్ బాబు కోర్టుకు జరూర్ హాజరు కావాల్సిందేనని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆరవ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటిన్ మెజిస్ట్రేట్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఉదంతంలో రచయిత శరత్ చంద్ర వేసిన పిటీషన్ మేరకు శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ నిర్మాత ఎర్నేని నవీన్ కూడా గతంలో కోర్టు సమన్లు జారీ చేసింది. క్రిమినల్ కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇవ్వాలని మహేష్ బాబు తరుపున పంగట్ల తాతగిరి గిరిధర్ రావు హాజరౌతారని హైకోర్టు నుండి తీస్కున్న మినహాయింపు లేఖను క్రిమినల్ కోర్టు పరిశీలించాక సాంకేతికంగా వున్న లోపాలను దృష్ఠిలో వుంచుకొని న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా మహేష్ సతీమణి MB క్రియేషన్స్ భాగస్వామి నమ్రతా శిరోద్కర్ డైరెక్టర్ హోదాలో తమ సంస్థ నుండి గిరిధర్ హాజరయ్యేలా తమ సంస్థ తీర్మాన పత్రాన్ని కోర్టులో దాఖలు పరిచారు. తదుపరి విచారణ జూన్ 26 కి కోర్టు వాయిదా వేసింది.

ఎర్నేని నవీన్ కు రీ సమన్లు 

నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన సమన్లకు స్పందించనందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరోసారి సమన్లు జారీ చెయ్యాలని నిర్ణయించబడింది. కాగా శరత్ చంద్ర తరుపు న్యాయవాది పవని శివకుమార్ వాదనలు వినిపించగా మహేష్ బాబు తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి తన వాదనను వినిపించగా ఆయన వాదనను కోర్టు తిరస్కరించింది. కాగా ఇటీవల సిటీ సివిల్ కోర్టు కూడా శ్రీమంతుడు బృందానికి గత ఏడాదిగా కోర్టుకి వకాల్తా వేయనందుకు ఫైన్ వేసింది. క్రిమినల్ కోర్టు నిర్ణయం మరో శరాఘాతం.

నమ్రత అథరైజేషన్ చెల్లదు

తాము క్రింది కోర్టులో మహేష్ బాబుకు సమన్లు జారీ చేస్తే గిరిధర్ హాజరౌతారనడం కేసును నీరుగార్చడమేనని శరత్ చంద్ర ఆరోపిస్తున్నారు.రచయితల పక్షాన తాను పోరాడుతున్నానని తన నవల చచ్చేంత ప్రేమని కొరటాల శివ కాపీ చెయ్యలేదని రచయితల సంఘం భావిస్తే తాను కేసును ఉపసంహరించుకోవడానికి సిద్ధమేనంటున్నారైటర్ శరత్ చంద్ర.కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. హీలోలు కూడా దొంగలనే విషయం స్పష్టంగా అర్థమౌతున్నది కదా !?

– సంఘీర్