ఐటీ ఉద్యోగులకు కంపెనీ షాక్.. ఆదుకున్న కశ్మీర్ ప్రభుత్వం  - MicTv.in - Telugu News
mictv telugu

ఐటీ ఉద్యోగులకు కంపెనీ షాక్.. ఆదుకున్న కశ్మీర్ ప్రభుత్వం 

August 19, 2019

Srinagar MNC puts Kashmir employees

ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. వదంతులు వ్యాపించకుండా ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ తదితర సర్వీసులను రద్దు చేసింది. క్రమంగా వాటిని పునరుద్ధరిస్తోంది. కమ్యూనికేషన్ల రద్దు అప్పుడే ప్ర్రభావం చూసింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులు బంద్ కావడంతో క్లయింట్లతో సంప్రదింపులు జరపకలేక  ప్రముఖ ఐటీ దిగ్గజం ఏజీస్.. శ్రీనగర్‌లోని తన బీపీఓ సెంటరును మూసేసింది. అంతేకాకుండా 70 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పు ఇచ్చింది. దీంతో బాధితులు విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ కమిషనర్ షహీద్ ఇక్బాల్ చౌధురీ జోక్యం చేసుకుని కంపోనీ యాజమాన్యంతో మాట్లాడారు. 

ఉద్వాసనకు గురవుతున్న వారికి మరో మూడు నెలలు ఉద్యోగంలో కొనసాగించాలని కోరారు దీనిపై ప్రభుత్వం కూడా స్పందించింది. బాధితులకు తాము పనులు అప్పగిస్తామని, వారు పనిలో మరో మూడు నెలు సాగేందుకు సాయం చేస్తామని తెలిపింది. చౌధురి కశ్మీర్ లోయలో ఐటీ కంపెనీ స్థాపనకు సాయపడుతున్నారు. ఆయన బందిపోరాలో పనిచేసినప్పుడు అక్కడ ఓ బీపీవో సంస్థ ఏర్పాటుకు సాయం చేశారు. కశ్మీర్ లోయంలో ఇంగ్లిష్ మాట్లాడే యువతీయువకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్టోబరులో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహించే ప్రపంచ పెట్టుబడుల సదస్సు వల్ల రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వస్తాయని భావిస్తున్నారు.