శ్రీరామనవమిని ఎలా జరపుకోవాలంటే.. ప్రభుత్వ ఆదేశాలివీ..  - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరామనవమిని ఎలా జరపుకోవాలంటే.. ప్రభుత్వ ఆదేశాలివీ.. 

March 31, 2020

Sriramanavami celebration corona times

కరోనా లాక్‌డౌన్ ఉగాది పండగను చేదుగా మార్చేసిన సంగతి తెలిసిందే. కనీసం ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికే వీల్లేకుండా ఉంది. కానీ ఎప్పుడొచ్చినా పండగ పండగే కదా. భౌతిక దూరం పాటిస్తూ మార్కెట్లో సరుకులు కొని జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎల్లుండి శ్రీరామనవమిని కరోనా విపత్తులో ఎలా జరుపుకోవాలో వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

పండగ రోజున ప్రజలు గుళ్లకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ‘ఆలయాల్లో అర్చకులు మాత్రమే పూజలు నిర్వహించాలి. భక్తులను ఆలయాల్లోకి రానివ్వొద్దు..’ అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రజలు అందరి ఆరోగ్యం కోసం దైవదర్శనాన్ని వాయిదా వేసుకోవాలని, పండగను ఇంట్లోనే చేసుకోవాలని సూచించారు. అయితే రాష్ట్రంలోని ముఖ్య వైష్ణవాలయాల్లో పూజలకు ఎలాంటిలోటూ రానివ్వబోమని హామీ ఇచ్చారు.