నువ్వు జనద్రోహివి.. పవన్‌‌పై శ్రీశక్తి పోస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

నువ్వు జనద్రోహివి.. పవన్‌‌పై శ్రీశక్తి పోస్ట్

April 23, 2018

నటి శ్రీశక్తి పవన్ కల్యణ్‌ను టార్గెట్ చేసి తన ఎఫ్‌బీ వాల్ మీద పోస్టులు పెడుతోంది. తాజాగ పవన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టింది. తన ఎఫ్‌బీ ఫ్రెండ్స్ వాల్ మీద తనకు నచ్చిన పోస్టును డౌన్‌లోడ్ చేసి పెడుతున్నానని ముందుగానే వివరణ ఇచ్చి పోస్ట్ షేర్ చేసింది. అంతకు ముందు పవన్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ఇప్పుడు పవన్‌నే డైరెక్టుగా అంటూ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఆమె వాల్ నుంచి యథాతధంగా..

Naku f.b lo frds walls midha nachina posts nenu download chesukuni peduthunna posts ..

మిస్టర్ ….. ఏమిటి ఈ మాయ…

పాచి పోయిన లడ్డులు అన్నావు..

ఉత్తరం దక్షిణం అన్నావు..

అవినీతి జరుగుతుందన్నావు..

నిరూపించమంటే నాకు తెలవదు బయట అనుకుంటున్నారు…చూసుకోండి అన్నావు…

నాకు కులం లేదూ అన్నావు..మా రంగాను అన్యాయంగా చంపేశారు అని అన్నావు…

కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు..పెద్ద ఫార్సు చేశావు…

లెక్కలు నేను తేలుస్తాను అన్నావు…కమిటీలో దొంగల్ని పెట్టావు..

మా అన్న చేసింది తప్పు అన్నావు..మా అన్న ను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు..

నీకు గెలిచే సత్తా లేక పోయినా పేద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు…

పవర్ ను అనుకున్నావు..ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో…

ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు…. ఒకటికి మూడు చేసుకున్నావు…..

నీ అవసరాలకోసం అందర్నీ దగా చేశావు..చివరకు అమ్మకు కూడా బురద పూశావు…

చివరకు చేత కాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు..

నీకు నటన రాదనుకున్నాము కాని సినిమాల్లో రాకపోయినా బయట బాగానే నటించావు…

నిన్నేమనాలి….నువ్వు ఆంధ్రద్రోహివి…ప్రజా ద్రోహివి..జనద్రోహివి.

తెలుగుప్రజలు నిన్ను క్షమించరు……

ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి కాపలాగా ఉన్నావు…. ఎవరూ ఏమాట మోడీని అన్నా… మోడీని తిడతారా అని ట్విట్టర్ వేదికగా సపోర్ట్ చేస్తున్నావు…..

ఇదేనా నీవు చేగువేరా నుండి తీసుకున్న ఆదర్శం….

 

అని ఘాటుగా విమర్శించింది శ్రీశక్తి. దీనిపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.