చెత్త ముంజ, పెంట ముంజ.. కరాటే కళ్యాణిపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

చెత్త ముంజ, పెంట ముంజ.. కరాటే కళ్యాణిపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

May 16, 2022

 

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి, సినీ నటి కరాటే కళ్యాణీల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ వాదనలో కొందరు కళ్యాణికి మద్ధతిస్తుంటుంటే.. మరికొందరు తమ సపోర్ట్ శ్రీకాంత్ రెడ్డికే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ గొడవపై సంచలన నటి శ్రీరెడ్డి స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా కళ్యాణిపై మండిపడ్డారు. సినిమాలలో అవకాశాలు రాని వారు.. యూట్యూబ్ ద్వారా తమ టాలెంట్‌ని నిరూపించుకుంటుంటే అక్కడా కూడా వారిని ఎదగనీయకుండా.. వారిపై దాడి చేయడం ఏంటని కరాటే కళ్యాణిని ప్రశ్నించారు.

శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్‌ వీడియోల వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ముందుగానే పీఎస్ లో కంప్లయింట్ ఇవ్వాలి కానీ.. ఇంటి ముందుకొచ్చి దమ్ముంటే బయటకు రా అని రెచ్చగొట్టి చేయి చేసుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అని నిలదీశారు. ఇదే విషయంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఆ సినిమాలో సెలబ్రిటీలు అయిన సమంత, రష్మిక వంటి హీరోయిన్స్ ప్రైవేట్ పార్ట్ పై హీరోలు చెయ్యి వేసినప్పుడు ఎక్కడికి వెళ్లావ్, ఏం చేశావ్ అంటూ మండిపడ్డారు. కళ్యాణిని ముంజ అని సంబోధిస్తూ.. నీతులు చెప్పే ముందు నీ బతుకు ఏంటో తెలుసుకోవాలని, సినిమాలలో నీ వేషాలంటో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఊరి మీద పడి తిరగకుండా.. పద్దతిగా ఎవరి పని వాళ్లు చేసుకోవాలని సలహనిచ్చారు.