శ్రీశైలం డ్యాంకు ముప్పు, ఏపీ ఉండదు.. ‘వాటర్ మ్యాన్’ వార్నింగ్   - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీశైలం డ్యాంకు ముప్పు, ఏపీ ఉండదు.. ‘వాటర్ మ్యాన్’ వార్నింగ్  

November 20, 2019

Srisailam dam..

తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడిందని, మరమ్మత్తులు చేయకపోతే విషాదం తప్పదని ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరున్న రాజేంద్రసింగ్ హెచ్చరించారు.  గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టుల భద్రతను, నీటివనరుల లభ్యతను అంచనా వేస్తున్నారు. ఏపీలోని శ్రీశైలం డ్యాంను సందర్శించిన ఆయన ఆ డ్యాం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రాజెక్టు పతనానికి కారణం  ప్రభుత్వాలే అని ఆరోపించారు. ప్రాజెక్టులు నిర్మించాక వాటి నిర్వహణ గురించి ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదని అన్నారు. ఒకవేళ ఏదైనా విపత్తు జరిగితే సగం ఆంధ్రప్రదేశ్ కన్పించకుండా పోతుందని తెలిపారు. డ్యాం సమీపంలోని నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, త్వరితగతిన ప్రభుత్వం చర్యలు చేపడితే కనుక డ్యాంను రక్షించుకోగల్గుతామని సూచించారు.