‘అక్సర్ 2’ లో శ్రీశాంత్  - MicTv.in - Telugu News
mictv telugu

‘అక్సర్ 2’ లో శ్రీశాంత్ 

August 30, 2017

క్రికెటర్ శ్రీశాంత్ తెలుగులో ‘ టీం 5 ’ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.  జూలై నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా  ఎందుకో వాయిదా పడింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మళయాలం భాషల్లో ఏక కాలంలో విడుదల అవుతోంది. అయితే తాజాగా శ్రీశాంత్ హిందీలో కూడా ఒక సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ సినిమానే  ‘అక్సర్ 2 ’ జరీన్ ఖాన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీశాంత్ రోల్ ప్రాముఖ్యతను సంతరించుకుంది. 6 అక్టోబర్ కు రిలీజ్ అవుతున్న అక్సర్ సినిమా తప్పకుండా తనకు హిందీలో బ్రేకిస్తుందని భావిస్తున్నాడు శ్రీశాంత్. ఇప్పటికే బాలీవుడ్, మళయాలంలో తనకు సినిమా ఆఫర్లు వస్తున్నాయట. సో ఈ సినిమా రిలీజ్ అయితే తప్పకుండా శ్రీశాంత్ బిజీ అవడం ఖాయం అంటున్నారు తన ఫ్యాన్స్.