తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూకాంప్లెక్స్‌లో తోపులాట జరుగగా, భక్తులు ఒకరిపై మరొకరు గొడవకు దిగారు. అంతకు ముందు స్వామివారిని త్వరగా దర్శనం చేసుకోవాలనే తొందరలో వేగంగా వెళ్తూ ఒకరిపై మరొకరు పడిపోయారు. ఆడవారిపై పడిపోవడం ఏంటని వృద్ధుడు ప్రశ్నించగా, ఆగ్రహించిన ఓ యువకుడు ముక్కు, దవడలపై గుద్ది రక్తం వచ్చేలా కొట్టాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, విషయం తెలుసుకున్న విజిలెన్స్ సిబ్బంది హుటాహుటిన చేరుకొని గొడవను సద్దుమణిగేలా చేశారు. దాడిలో గాయపడిన అనంతపురం ఉరవకొండకు చెందిన సుధాకర్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా, గొడవలకు గల కారణాన్ని అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో పడ్డారు.