SRSP కి పునరుజ్జీవనం అంటే... - MicTv.in - Telugu News
mictv telugu

SRSP కి పునరుజ్జీవనం అంటే…

August 10, 2017

ఎస్సాఆర్ ఎస్పీకి పునరుజ్జీవనం చేస్తామని ప్రభుత్వం అంటున్నది. ఇంతకు  పునరుజ్జీవనం అంటే ఏమిటీ.? ఎందుకు చేయాలని అనుకుంటున్నది.  ఇక్కడే  ఎందుకు చేస్తున్నది.  దీని వల్ల  ప్రయోజనం ఎవరికి ఎట్లా ఉంటుంది….. ఈ పునరజ్జీవన పథకం అర్థం కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే……….

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులను మనకు అవసరం అయిన రీతిలో  నిర్మిస్తున్నది. కొన్నింటికి రీ డిజైన్ చేసింది. కొత్తగా కొన్ని ప్రతిపాదించి నిర్మిస్తున్నది. తెలంగాణలో ఉన్న ప్రతీ ఎకరాకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వరద కాలువను వినియోగించుకుని  శ్రీరాం సాగర్  ఆయకట్టుతో పాటు… దీనిపై ప్రాజెక్టుపై ఆధారపడిన అన్ని రకాల స్కీంలకు నీళ్లు అందించే ప్లాన్  చేస్తున్నది.

పునరుజ్జీవనం పథకం అంటే  కాలేశ్వరం ప్రాజెక్టు  నుండి నీళ్లను తీసుకుని శ్రీరాం సాగర్ కు వరద కాలువ ద్వారా లిఫ్టు చేయడమే. గతంలో శ్రీరాం సాగర్ నీళ్లను తీసుకుని మిడ్ మానేరు ఆ కిందకు ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లిచ్చేందు వరద కాలువను నిర్మించారు. ఈ కాలువ ద్వారా కొన్ని సార్లు మిడ్, లోయర్ మానేరు వరకు నీళ్లు తీసుకెళ్లారు. అదీ  శ్రీరాంసాగర్ కు వరద వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు సాగర్ లో నీళ్లు లేవు. మానేరుపై నిర్మించిన  ప్రాజెక్టుల్లో కూడా పూర్తి స్థాయిలో నీరు లేదు. అందుకే వరద కాలువను ఉపయోగిస్తున్నారు.

ఈ పథకం కింద వరద కాలువను ఎట్లా ఉపయోగిస్తారంటే…. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీళ్లను  మూడు దశల్లో లిఫ్టు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పోస్తారు. అక్కడి నుండి అప్రోచ్ ఛానెల్, సోరంగాల ద్వారా వరద కాలువకు తీసుకొస్తారు. ఈ వరద కాలువ 99వ కిలోమీటర్ వద్ద రోజుకు రెండు టిఎంసీల చొప్పున నీళ్లు పోస్తారు. ఇక్కడి నుండి ఒక టిఎంసీ నీళ్లను మిమడ్ మానేరుకు, మరో టిఎంసీ నీళ్లను వరద కాలువలో  మూడు దశల్లో రివర్స్ పంపింగ్ చేసి శ్రీరాం సాగర్ లోకి పోస్తారు. ఇట్లా చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కింద ఉన్న సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో  సాగు నీరు ఇస్తారు. అంతే కాకుండా మిషన్ భగీరథ,  కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలకు సాగు నీరు ఇస్తారు.

ఇదంతా కూడా సాగర్ లో  నీళ్లు లేనప్పుడు  చేస్తారు. ఒక వేళ  శ్రీరాం సాగర్ కే వరద వస్తే గనుక లిఫ్టు ఆపేసి శ్రీరాం సాగర్ నుండి నీళ్లను మిడ్ మానేరకు తీసుకెళ్తారు. దీంతోపాటు శ్రీరాం సాగర్ ప్రాజెక్టు కాలువలను కూడా పునరుద్దిరిస్తున్నారు. పునరుజ్జీవన కోసం వెయ్యి కోట్ల రూపాయలు, కాలువల మరమ్మత్తుల కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఓవరాల్ గా ఇదీ  శ్రీరాం సాగర్ పునరుజ్జీవన పథకం అంటే.