ఇక డైరెక్టర్ శృతిహాసన్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఇక డైరెక్టర్ శృతిహాసన్..!

July 20, 2017

గ్లామర్ బ్యూటీ శృతి హాసన్… స్టార్ యాక్షన్ కెమెరా అనబోతోందా…త్వరలో మెగా ఫోన్ పట్టబోతుందో…హీరోయిన్ గా అవకాశాలు లేక డైరెక్టర్ గా టర్న్ తీసుకోబోతుందా… ప్రస్తుతం సిచ్చూయేషన్ చూస్తే అలాగే అనిపిస్తోంది. దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుందన్న కొందరు ఆమెకు సలహాలు ఇచ్చారు. దీనిపై బాగా ఆలోచించిన శృతి ఆ దిశగా అడుగులు వేస్తుంది.

కమల్ గారాల పట్టి శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక అక్కడ నుండి వెనుతిరిగి చూసుకోలేదు. తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటింది. కేవలం నటిగానే కాదు గాయనిగా ఫ్రూవ్ చేసుకుంది.ఇప్పుడు డైరెక్టర్ గాను మారబోతోంది. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు ఫ్యాన్స్.