ఆస్కార్ రేసులో ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు రాజమౌళి. ఇప్పటికే నాటు నాటు పాట అత్యంత ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్లొబ్ అవార్డు కైవసం చేసుకుంది. ఈ అవార్డు అందుకున్న తోలి ఇండియన్ మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది. ఇండియాలో అయితే ఎక్కడ చూసినా జక్కన్న నామస్మరణే. ఇలాంటి వేళ రాజమౌళికి అనుకోని చిక్కు వచ్చి పడింది. కొందరు గిట్టని వారు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 15ఏళ్ళ కిందట హ్రితిక్ రోషన్ గురించి మాట్లాడిన వీడియో క్లిప్ ని ఇప్పుడు వైరల్ చేస్తు.. రాజమౌళిని కించపరిచే పనులు చేస్తున్నారు. ఆ వీడియోలో హ్రితిక్ రోషన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ప్రచారం చేస్తూ.. బాలీవుడ్ ప్రేక్షుకుల్లో రాజమౌళిపై తప్పుడు భావాలని తెస్తున్నారు. ఈ విషయం గమనించిన రాజమౌళి పెద్దరికంగా తప్పు ఒప్పుకుని తాజాగా క్షమాపణలు సైతం చెప్పాడు.
బాలీవుడ్ లో రాజమౌళి అంటే గిట్టని వారు స్ప్రెడ్ చేస్తున్న ఈ వీడియోపై తాజాగా రాజమౌళి స్పందించాడు. ‘‘15 ఏళ్ల ముందు వీడియో ఇప్పుడెందుకు నెట్టింట వైరల్ అవుతుందో తెలియటం లేదు. ఆ వీడియోను గమనిస్తే.. అందులో నేను ఎంపిక చేసుకున్న పదాలు బాగా లేదు. ఈ విషయాన్ని నేను అంగీకరించాల్సిందే. అయితే నిజంగా హృతిక్ను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నేను అతడిని ఎంతో గౌరవిస్తాను’’ అన్నారు. రాజమౌళి అలా చెప్పటంతో నెటిజన్స్ జక్కన్నను ప్రశంసిస్తున్నారు. తప్పు ఒప్పుకోవటం గొప్ప విషయం.
మరోసారి మీరు మీ వినయాన్ని చూపించారు అంటూ నెటిజన్స్ రాజమౌళిని అభినందిస్తున్నారు. అయితే అప్పట్లో భిల్లా సినిమా ఆడియో వేడుకలో రాజమౌళి ప్రభాస్ ని పొగిడే క్రమంలో హ్రితిక్ ని అవమానించే వర్డ్స్ వాడడన్నది నిజమే. ఆ సమయంలో ప్రభాస్ లుక్ గురించి మాట్లాడుతూ ధూమ్ 2లో హృతిక్ లుక్ చూశానని, భిల్లా ట్రైలర్ చూశాక.. ప్రభాస్ ముందు హృతిక్ నథింగ్ అని అన్నారు. అయితే ఈ పాత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ చేయటం దారుణమని టాలీవుడ్ నెటిజన్స్ స్పందిస్తున్నారు.