అదే నా చివరి సినిమా అవ్వొచ్చు.. రాజమౌళి - MicTv.in - Telugu News
mictv telugu

అదే నా చివరి సినిమా అవ్వొచ్చు.. రాజమౌళి

March 14, 2019

ఈరోజు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో దర్శకుడు రాజమౌళి కీలక విషయాలను తెలిపారు. మొదట ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా వివరాలు మీడియాకు తెలిపిన తరువాత మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

Ss rajamouli said that mahabharatam will be his last movie or series

ఈ సందర్భంగా మీరు బాహుబలి తరువాత మహాభారతం తీస్తారని వార్తలు వచ్చాయి. ఎప్పుడు చేస్తున్నారు మహాభారతం, మహాభారతం ప్రాజెక్ట్ మీ మైండ్‌లో ఏ స్థానంలో ఉందని ఓ విలేకరి అడగగా.. రాజమౌళి స్పందిస్తూ.. మహాభారతం నా తరువాతి చిత్రమని నేను ఎక్కడా చెప్పలేదని అన్నారు. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పానని తెలిపారు. అలాగే మహాభారతాన్ని కచ్చితంగా తీస్తాను బహుశా అదే నా చివరి చిత్రం లేదా సిరీస్ అవ్వోచ్చని వెల్లడించారు. మహాభారతం ప్రాజెక్ట్ మీ మైండ్‌లో ఏ స్థానంలో ఉన్నదనే ప్రశ్నకు.. మహాభారతం 24 గంటలు నా మైండ్‌లో రన్ అవుతూనే ఉంటుందని.. దాని కోసం ఆయన మైండ్‌లో ఓ ప్రత్యేకమైన విభాగం పనిచేస్తుందని సరదాగా సమాధానమిచ్చారు.