రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో నిన్ననే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే విషయాన్ని రాజమౌళి వెల్లడించారు.
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ… ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు.. దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ గా మారింది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో డా.కే.ఎల్.నారాయణ ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి దాదాపు మూడేళ్ళ క్రితమే కమిటయ్యారు. పలు కారణాల ఆగుతూ వచ్చిన ఈ సినిమా పట్టాలెక్కనున్నట్లు ట్వీట్ చేశారు.
My next film with @urstrulyMahesh will be a "globetrotting action adventure" – @ssrajamouli #MaheshBabu𓃵 #SSRajamouli pic.twitter.com/PgVP2CAbpu
— Thyview (@Thyview) September 13, 2022
ఈ ప్రకటనపై మహేశ్‌బాబు తన స్పందన తెలియజేశారు. “ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది” అని అన్నారు. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ విషయంపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.మహేష్ బాబు, రాజమౌళి చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.