టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ తాజాగా ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు దక్కింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ తీసేందుకు ఓ అద్భుతమైన ఆలోచన తట్టిందనని ప్రకటించారు. దాన్ని స్ర్కిప్టుగా డెవలప్ చేసే పనిలో ఉన్నట్టు చెప్పారు.
సినిమాకు పాన్ వరల్డ్ స్థాయిలో ప్రశంసలు దక్కడంతో .. సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చిందని చెప్పారు. స్వీకెల్ కోసం చాలా ఐడియాలు వచ్చాయని.. అయితే బలవతంగా సీక్వెల్ తీయకూడదని భావించామన్నారు. వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఆర్ఆర్ఆర్కు లభించిన ఆదరణ చూసి.. కొన్ని వారాల క్రితం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో , కజిన్‌తో (రచన బృందంలో భాగమైన వారితో) మళ్ళీ చర్చించామని చెప్పారు. అప్పుడు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందని, ఆ ఆలోచన ఆధారంగా వెంటనే కథ రాయడం ప్రారంభించామన్నారు. స్క్రిప్ట్ పూర్తయ్యేదాకా సీక్వెల్ విషయంలో ముందుకెళ్లలేమని , ప్రస్తుతం తామంతా అదే పనిలో ఉన్నామని చెప్పారు.