'ఆర్ఆర్ఆర్'లోకి అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు! - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’లోకి అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు!

February 3, 2020

mahesh babu...

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూ.ఎన్టీఆర్.. కొమరం భీమ్ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మహేష్ బాబు కూడా పాలు పంచుకోనున్నారని తెలుస్తోంది. తాజాగా రాజమౌళి.. మహేష్ బాబు, అమితాబ్ బచ్చన్‌తో చర్చలు జరిపారని సమాచారం.

కాకపోతే వాళ్లు కనిపించరు.. వినిపిస్తారంతే. ‘ఆర్ఆర్‌ఆర్‌’ సినిమా తెలుగు వెర్షన్‌కు మహేశ్‌ బాబు, హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ బచ్చన్ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నారట. అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తమిళం, మలయాళ వెర్షన్లకు ఏ హీరోలతో వాయిస్‌ ఓవర్‌ ఇప్పించాలనే విషయంలో రాజమౌళి ఇంకా నిర్ణయానికి రాలేదట. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటులు నటిస్తున్నారు. ఆలియా భట్‌.. రామ్‌చరణ్‌కు జంటగా కనిపించనుంది. అలాగే హాలీవుడ్‌ నటి ఒలివియా మోరీస్‌ ఎన్టీఆర్‌ పక్కన సందడి చేయనుంది. వీరితోపాటు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది జులై 30 విడుదల కాబోతుంది.