SSC GD Constable Notification 2022 PDF Out for 24369 Vacancies
mictv telugu

24,369 కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

October 28, 2022

ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త. పదవ తరగతి పాసయితే చాలు.. కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీ జాబ్‌ నోటిఫికేషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 24,369 జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఖాళీల కోసం అర్హత, ఆసక్తిగ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. NCBలో సిపాయి పోస్టులకు.. నెలకు రూ. 18,000 నుండి 56,900 మధ్య చెల్లిస్తారు. BSF, CRPF, CISF, ITBP, SSF, SSB, NIA మరియు రైఫిల్‌మెన్ పోస్టులకు రూ. 21,700- 69,100 మధ్య చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 30 లోగా https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన బోర్ట్ నుంచి పదవ తరగతి/ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పురుష అభ్యర్థుల యొక్క ఎత్తు 170 సె.మీ లకు తగ్గకూడదు. మహిళా అభ్యర్థులకైతే.. 157 సెం.మీలకు తగ్గకూడదు.
వయో పరిమితి: జనవరి 01, 2023 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏండ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏండ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:
• దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 27, 2022
• దరఖాస్తు ఫారమ్ నింపడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2022
• ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ: డిసెంబర్ 1, 2022
• ఆఫ్‌లైన్ చలాన్ రూపొందించడానికి చివరి తేదీ: నవంబర్ 30, 2022
• చలాన్ ద్వారా చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2022
• ఎస్‌ఎస్‌సీ జీడీ పరీక్ష తేదీ: జనవరి 2023