SSC increased age limit for 24 thousand constable posts
mictv telugu

24 వేల కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి పెంచిన SSC

November 10, 2022

SSC increased age limit for 24 thousand constable posts

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల విడుదలైన కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్‌‌లో 24,369 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 27న రిలీజైన ఈ నోటిఫికేషన్‌‌లో అభ్యర్ధుల వయసు 2023 జనవరి 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు ఉండాలని నిర్దేశించింది.

అభ్యర్ధులు తప్పనిసరిగా 2000 జనవరి 2 నుంచి 2005 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. అయితే తాజాగా దానికి సవరణ చేస్తూ మూడేళ్ల అదనపు వయో పరిమితిని నిర్ణయించింది. దీంతో మరింత మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లభించినట్టైంది. పదవ తరగతి అర్హత కలిగి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీని నవంబర్ 30గా నిర్ణయించారు. అప్లై చేసుకునే వారు రూ. 100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వ్‌‌డ్ కేటగిరీ వాళ్లు, మాజీ సైనికులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఐదు దశల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఎంపికైన తర్వాత ఎన్‌సీబీ సిపాయికి రూ.18 వేల నుంచి 56 వేల 900 వరకు జీతభత్యాలు ఉంటాయి. ఇతర పోస్టులకు రూ. 21,700 నుంచి 69,100 మధ్య నెల జీతం లభిస్తుంది.