భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డిపార్ట్మెంట్లో పనిచేసే స్కోప్ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 18జనవరి 2023న తన అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 12,523 ఖాళీలను జనవరి 20న ప్రకటించింది. అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 18 జనవరి 2023 నుంచి 17, ఫిబ్రవరి 2023 వరకు డైరెక్టుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష ఏప్రిల్ 1, 2023లో జరుగుతుంది.
ఈ పరీక్షను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహిస్తోంది. పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలు, భారత ప్రభుత్వ కార్యాలయాల్లో జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టులలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఎస్ఎస్ సి , ఎంటీఎస్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://ssc.nic.in/లో చూడవచ్చు.
ఆన్లైన్లో దరఖాస్తు :
ఈ నోటిఫికేషన్ విడుదలతో ఎస్ఎస్సీ, ఎంటీఎస్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 18, 2023 నుంచి ఫిబ్రవరి 17, 2023 వరకు ఉంటుంది.
తేదీలు:
ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయడానికి చివరి తేదీ 19 ఫిబ్రవరి 2023, చలాన్ తో ఫీజు పేమెంట్ చివరి తేదీ 20 ఫిబ్రవరి 2023 వరకు ఉంది.
అర్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఒకవేళ అభ్యర్థి దరఖాస్తు ఫారమ్‌ను ముగింపు తేదీకి ముందు పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడరు.