SSC Recruitment 2023 ssc is inviting applications for 5369 posts how will be the selection
mictv telugu

ఎస్ఎస్ఎస్సీలో భారీగా ఉద్యోగాలు, ఎవరు అర్హలు, ఎలా ఎంపిక చేస్తారంటే..?

March 7, 2023

SSC Recruitment 2023 ssc is inviting applications for 5369 posts how will be the selection

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన sscలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి..ఏ విధంగా ఎంపిక చేస్తారో తెలుసుకుందాం.

నోటిఫికేషన్ లో మొత్తం 5369ఖాళీలను పేర్కొన్నారు. వీటిలో ఇన్వెస్టిగేటర్ గ్రేట్ 2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్ సౌండ్ టేక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబర్రరీ కమ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్,వంటి పోస్టులు ఉన్నాయి.

– ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, హయ్యర్ సెంకడరీ ఎడ్యుకేషన్, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

-ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
-అభ్యర్థులు స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

-06-03-2023నుంచి ప్రారంభమై 27-03-2023న ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది.
-కంప్యూటర్ కు సంబంధించిన పరీక్షను జూన్ లేదా జులైలో నిర్వహిస్తారు.
-పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.