అతడు, ఖలేజా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివ్రిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో మరొక సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్‌బీ28’ వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ చిత్రీకరిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమానున నిర్మిస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ లో ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ‘ఎస్ఎస్ఎమ్‌బీ28’ మళ్లీ సంవత్సరం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఆఫీషియల్‌గా ప్రకటించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలిపింది.
రిలీజ్ డేట్ తో పాటు మహేష్ మాస్ లుక్ లో నడిచి వస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్‌తో స్టైల్‌గా మహేష్ నడిచి వస్తున్నాడు.ఆ ఫోటో ప్రకారం ఓ మిర్చి మార్కెట్లో ఫైట్ సీన్‌గా తెలుస్తోంది. ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28’ కు ‘అమరావతి అటు ఇటు’, ‘గుంటూరు కారం’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.
ఎస్‌ఎస్‌ఎమ్‌బీ28 లో పూజా హెగ్డే, శ్రీ లీల మహేస్ సరసన నటిస్తున్నారు. చిత్రానికి ఎస్‌ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మలయాళం ప్రముఖ నటుడు జయరాం ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. “అల వైకుంఠపురం” సినిమా లో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో కనిపించిన జయరాం ఇప్పుడు ఈ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించనున్నారు అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.