St Joseph's School in Madhya Pradesh has installed CCTV cameras in the bathroom
mictv telugu

స్కూలు బాత్రూంలో సీసీ కెమరాలు.. యాజమాన్యం షాకింగ్ వివరణ

September 2, 2022

బాత్రూంలలో రహస్యంగా సీసీ కెమరాలు అమర్చి తద్వరా బాలికలు, యువతులను బెదిరించి అత్యాచారానికి పాల్పడడం తరచూ వింటూనే ఉన్నాం. దీంతో ఏ ప్రాంతంలో కెమెరా ఉందో అని వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, మధ్యప్రదేశ్‌లోని ఓ స్కూలు యాజమాన్యం స్వయంగా ఈ దుర్మార్గపు పనికి పూనుకుంది. బాత్రూంలో సీసీ కెమరాలు అమర్చి అడ్డంగా దొరికిపోయింది. అయితే వారిచ్చిన వివరణ మాత్రం అధికారులకు షాక్‌కు గురిచేసింది. పూర్తి వివరాల్లోకెళితే.. రత్లాంలోని సెయింట్ జోసెఫ్ స్కూలు బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టగా పది రోజుల క్రితం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు వచ్చిన అధికారులు బాత్రూంలను పరిశీలించి అక్కడున్న సీసీ కెమెరాలను చూసి సీరియస్ అయ్యారు. స్కూలు యాజమాన్యం వివరణ కోరగా, విద్యార్ధులు బాత్రూంకి వెళ్లినప్పుడు అశ్లీల కామెంట్లు, అసభ్యకర బొమ్మలు వేస్తున్నారని, అలాంటి విద్యార్ధులను గుర్తించేందుకు కెమెరాలు పెట్టామని చెప్పారు. దీంతో ఫైర అయిన అధికారులు.. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులను పిలిచి మాట్లాడాలని, అంతేకానీ, ఇలా కెమెరాలు అమర్చకూడదని స్పష్టం చేశారు. అంతేకాక, ఇది చైల్డ్ పోర్నోగ్రఫీ కిందకు వస్తుందంటూ ఘటనపై పూర్తి వివరాలివ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాగా, ఈ స్కూలుపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. భారత్ మాతాకీ జై అన్నందుకు, నుదుటిన బొట్టు ధరించారని విద్యార్ధులను సస్పెండ్ చేయగా, తల్లిదండ్రుల ఆందోళనతో దిగి వచ్చింది. 2019లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధినిని కొందరు విద్యార్ధులు బ్లాక్ మెయిల్ చేసి రోజూ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా డబ్బులు కూడా డిమాండ్ చేయడంతో బాలిక తన చెవి కమ్మలను కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో స్కూలు పర్మిషన్ రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.