దండు కదిలింది జంబాయిరే.. తుడుం మోగింది జంబాయిరే - MicTv.in - Telugu News
mictv telugu

దండు కదిలింది జంబాయిరే.. తుడుం మోగింది జంబాయిరే

December 9, 2017

ఎస్టీల జాబితా నుంచి లంబాడాలను తొలగించాలంటూ శనివారం హైదరాబాద్ సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఆదివాసీలు భారీ సభ నిర్వహిచారు.

‘తుడుం దెబ్బ.. ఆదివాసీల ఆత్మగౌరవ సభ’తో జరిగిన ఈ కార్యక్రమానికి గిరిజన విప్లవకారుడు కొమురం భీం మనువడు కొమురం సోలేవాల్‌ వచ్చారు. బాడీలను ఆదివాసీల జాబితా నుంచి తీసేయాలన్నారు. ‘కొమురం భీం పోరాట స్పూర్తితో ముందుకెళ్దాం. ఆదివాసీలకే ప్రత్యేక కోటా ఉండాలి’ అని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచి వేలాది గిరిజనులు సభకు హాజరయ్యారు.