ఎస్టీల నుంచి లంబాడాలను తొలగించాలి: తుడుం దెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

ఎస్టీల నుంచి లంబాడాలను తొలగించాలి: తుడుం దెబ్బ

December 9, 2017

లంబాడాలను వెంటనే ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాబూరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఆదివాసుల ఆత్మ గౌరవ సదస్సులో ఆయన మాట్లాడారు. తమకు ఆంధ్రావాళ్లతో ప్రమాదం లేదని, లంబాడావాళ్లతోనే ముప్పు ఉందనన్నారు.

‘లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తీసేయాలి. ఆదివాసులు తమ హక్కులను సాధించుకునేంతవరకు పోరాడాలి. ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధం. మన ఎంపీ నగేష్.. కేసీఆర్ దగ్గర మాట తెచ్చే వరకు వదిలేది లేదు. 15 తేదీ వరకు గడువు ఇస్తున్నా.. ఈ లోగా ప్రభుత్వం దిగిరాక పోతే …మరో పోరాటం చేస్తాం. ఆదివాసీల ఆగ్రహం తప్పదు. లంబాడా దొంగలు కావాలని రచ్చకొడుతున్నారు. వందమంది లంబాడాలకు ఒక్క ఆదివాసీ ఎదర్కొంటాడు’ అని అన్నారు.

ఇది దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీల కోసం చేస్తున్న ఉద్యమమని, వరంగల్‌లో మరో సభను, ఆదివాసీ మహిళల బహిరంగ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ‘లంబాడాలు మా ఉద్యోగాలను, ఉపాధిని, సీట్లను దోచుకుంటున్నారు. ఆదివాసీలు దవాఖానకు పోతే చంపాలని చూస్తున్నారు’ అని అన్నారు. తాను ఉద్యమం ప్రారంభించినప్పుడే తన తల్లిదండ్రుకలు మాట ఇచ్చానని, దీన్ని తాకట్టు పెట్టనని, అవసరమైతే తల ఇస్తానని అన్నారు.