Staff baths in kitchen cum mess in basara triple iiit
mictv telugu

బాసర ఐఐటీలో ఘోరం.. వంటగదిలోనే స్నానాలు

August 6, 2022

బాసర ట్రిపుల్ ఐటీ రోజూ వార్తలకెక్కుతూనే ఉంది. సరైన భోజనం, వసతి సదుపాయాలు లేవంటూ విద్యార్థులు ఏకంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వాపోయారు. అయినా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. వందలాది విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల తరచూ అరోగ్యం పాలవుతున్నారు. ఒక విద్యార్థి చనిపోయాడు కూడా. ఈ నేపథ్యంలో ఐఐఐటీలో జరుగుతున్న ఓ తంతు వీడియో కలకలం రేపుతోంది.
ఫుడ్‌ పాయిజన్‌ జరిగిన కేంద్రీయ భండార్‌ కిచెన్ కమ్ మెస్‌లో సిబ్బంది స్నానం చేస్తున్న వీడియో బయటికొచ్చింది. వంటసామగ్రి ఉన్న చోటే ఇద్దరు సిబ్బంది చక్కగా స్నానాలు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ట్రిపుల్ ఐటీ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇంత అపరిశుభ్ర వాతావరణంలో వంటలు వండి, వడ్డించడం వల్లే తమ ఆరోగ్యం దెబ్బతింటోదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గవర్నర్ తమిళిసై విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోడానికి ఆదివారం బాసల ట్రిపు ఐటీకి చేరుకోకున్నారు.