షాద్‌నగర్‌లో మరో కీచక పర్వం.. స్టాఫ్ నర్సుపై అత్యాచారం
షాద్‌నగర్ సమీపంలో దిశపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను ఎన్‌కౌంటర్ కూడా చేశారు. అయినా కూడా కొంత మంది మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా ఓ స్టాఫ్ నర్సుపై సామూహిక అత్యాచారం జరిగింది. యువతికి బలవంతంగా మత్తు మందు ఇచ్చి ఈ ఘటనకు ఒడిగట్టారు. ఈ కీచక పర్వంలో ఆమె ప్రియుడే ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్టాఫ్ నర్సుగా పని చేస్తున్న యువతిపై ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెకు తాగించారు. ఆ తర్వాత ఎలికట్ట సమీపంలో ఉన్న ఐరన్ ఫ్యాక్టరీ వెనక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. ఆమెకు మెలకువ రావడంతో ప్రతి ఘటించగా తీవ్రంగా గాయపరిచారు. వారి నుంచి తప్పించుకొని పారిపోయి ఆమె తన ఇంటికి చేరుకుంది. కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించి లా అండ్ ఆర్డర్ ప్రటిష్టంగా పర్యవేక్షిస్తున్నా కూడా ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది.