స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా 11 వేల 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలోని వివిధ శాఖలు, సంస్థల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) 10,880, హవల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. పదోతరగతి అర్హతతో ఫిబ్రవరి 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి వయసు 18 నుంచి 25, మరికొన్నింటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసుండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్ధులకు పదేళ్లు, ఇదే కేటగిరీ ఓబీసీ అభ్యర్ధులకు 13 ఏళ్లు, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు 15 ఏళ్లవరకు వయోసడలింపు ఉంటుంది. అన్ రిజర్వ్డ్ అభ్యర్ధులకు ఫీజు రూ. 100, మిగతావారికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. పరీక్ష ఏప్రిల్లో జరుగనుండగా తేదీలను మాత్రం ప్రకటించలేదు. మిగతా పూర్తి వివరాలకు లేక ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం కోసం సంస్థ అధికార వెబ్ సైట్ https://ssc.nic.in/ ద్వారా తెలుసుకోవచ్చు.