మార్కెట్లోకి అరగని సబ్బు.. మనందరికీ అవసరమే - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్లోకి అరగని సబ్బు.. మనందరికీ అవసరమే

March 26, 2022

 03

మనం రోజుకు రకరకాల సబ్బులను వినియోగిస్తుంటాం. స్నానానికి ఒకటి, గిన్నెలు కడగడానికి ఒకటి, బట్టలు ఉతకడానికి ఒకటి అంటూ మురికిని తొలగించే సబ్బులను వాడుతుంటాం. కానీ వీటన్నింటినీ తలదన్నేలా మార్కెట్లోకి ఓ కొత్త సబ్బు వచ్చింది. ఈ సబ్బు అరగదు. నురగ రాదు. సాధారణ సబ్బు సైజులో ఉండే ఇది వెండి రంగులో ఉంటుంది. అంతేకాదు, వాసన కూడా ఉండదు. దీన్ని ఉక్కుతో తయారు చేస్తారు. మరి దీన్ని దేనికి వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజువారీ జీవితంలో వాడే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, పచ్చి మిర్చి, మసాలా వంటి దినుసుల వాసన మన చేతులకు అంటుకుంటుంది. మామూలు సబ్బులతో ఎంత కడిగినా ఆ వాసన అంత తొందరగా పోదు. అదే ఈ సబ్బు వల్ల ఆ వాసనను తొలగించుకోవచ్చు. చెడు వాసననను నివారిస్తుంది. మామూలు సబ్బులాగే దీన్నీ రుద్దుకోవాలి. ఈ సబ్బు అమైనో ఆమ్లాలతో చేయడం వల్ల శరీరంపై ఏర్పడిన సల్ఫర్ అణువులను తొలగిస్తుంది. అయితే వాడిన తర్వాత ఈ సబ్బును శుభ్రం చేసుకోవాలి. ఈ – కామర్స్ సైట్లలో దొరికే ఈ సబ్బు ధర రూ. 250 నుంచి రూ. 500 వరకు వాటి నాణ్యత ఆధారంగా ఉంటుంది. మనకు కావలంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు.