ఐసీసీ వరల్డ్ కప్ పాట అదుర్స్.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఐసీసీ వరల్డ్ కప్ పాట అదుర్స్.. (వీడియో)

May 18, 2019

ఐసీసీ ప్రపంచ కప్ కు సంబంధించిన సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ నెల 30వ తేదీన ప్రారంభ కానున్న వరల్డ్ కప్ కోసం ‘స్టాండ్ బై’ అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. దీన్ని అన్ని స్ట్రీమింగ్ వేదికలపై పురుషల ఐసీసీ అన్ని స్ట్రీమింగ్ వేదికలపై, మైదానాలు, నగరాల్లో వరల్డ్ కప్ కి సంబంధించిన కార్యక్రమాల్లో ప్లే చేస్తారు.

Stand by: Official 2019 ICC World Cup song released

ఈ పాలను కొత్త కళాకారుడు లోరిన్, బ్రిటన్ లో అత్యంత విజయవంతమైన, ప్రభావశీలురైన ‘రుడిమెంట్’ బ్యాండ్ రూపొందించారు. ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీల్లో ఒకటి. దాదాపు 10 లక్షల మందికి పైగా ప్రేక్షకులు ప్రత్యక్షంగా వీక్షిస్తారు. కోట్లాది మంది ప్రత్యక్ష ప్రసారాలను టీవీల్లో చూస్తారు. వరల్డ్ కప్ మే 30వ తేదీన ప్రారంభమై.. జూలై 14వ వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందులో మొత్తం పది జట్లు ఆడనున్నాయి. ప్రతీ జట్టు మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడాలి. వరల్డ్ కప్ కోసం భారత జట్టు ఈ నెల 22వ తేదీని ఇంగ్లాండ్ వెళ్లనుంది.