Star hero in trouble..complaint to police with audio clip
mictv telugu

చిక్కుల్లో స్టార్‌ హీరో..ఆడియో క్లిప్‌తో పోలీసులకు ఫిర్యాదు

August 11, 2022

Star hero in trouble..complaint to police with audio clip

శాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో దర్శన్.. తనని బెదిరిస్తున్నాడని, అతడి వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఫోన్‌లో అతడు పదే పదే బెదరిస్తున్నాడని..నిర్మాత భరత్‌ విష్ణుకాంత్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారింది. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించినా పోలీసులు హీరోపై కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించటం మొదలుపెట్టారు. దాంతో హీరో దర్శన్ అభిమానులు ఒక్కసారిగా ధర్నాలు, రాస్తారోకోలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

నిర్మాత భరత్‌ విష్ణుకాంత్‌ వెల్లడించిన వివరాల ప్రకారం…’భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ అనే చిత్రాన్ని నేను నిర్మిస్తున్నాను. ఈ సినిమాలో నటుడు ధృవన్‌ మెయిన్ రోల్‌ పోషిస్తున్నాడు. అయితే, కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఈ సినిమా షూటింగ్‌ మధ్యలోనే ఆగిపోయింది. నా దగ్గర డబ్బు లేకపోవడంతో సినిమాను పూర్తి చేయలేకపోయాను. ఈ విషయాన్ని ధృవన్‌కు వివరించాను. దానికి అతడు.. ఒకవేళ డబ్బు సర్ధుబాటు అయితే గనుక నేను సినిమాను తిరిగి ప్రారంభిస్తానని నాకు మాట ఇచ్చాడు. కానీ, ఇచ్చిన మాటను పక్కనపెట్టినా ధృవన్‌.. స్టార్‌ హీరో అయిన దర్శన్‌కు చెప్పుకుని వాపోయాడు. దాంతో దర్శన్‌..నాకు పదే పదే ఫోన్‌ చేసి సినిమాను ఎలాగైన పూర్తి చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని బెదిరిస్తున్నాడు. దాంతో నేను అతడు మాట్లాడిన ఆడియో క్లిపును కెంగేరి పోలీస్‌ స్టేషన్‌లో సబ్మిట్ చేశాను” అని ఆయన అన్నారు.

అయితే ఆ ఆడియోలో దర్శన్‌ మాట్లాడుతూ.. ‘వెంటనే సినిమాను పూర్తి చేయాలి. లేదంటే ఏదైనా జరగొచ్చు. నేను తలుచుకుంటే కనబడకుండా పోతావ్‌. నేను ఏదైనా చెప్పే చేస్తాను. నిన్ను ఎక్కడా కనిపించకుండా చేయగలను’ అంటూ నిర్మాతను భయపెట్టాడు. దీంతో నిర్మాత లాక్‌డౌన్‌ తర్వాత సినిమాను ప్రారంభిస్తానని చెప్పుకురాడం ఆడియోలో క్లియర్‌ ఉంది. ఇక ఈ ఆడియో ఆధారంగా పోలీసులు దర్శన్‌, నటుడు ధృవన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.